...
...
Next Story

ప్రభుత్వమే ఓ ఓటీటీ స్టార్ట్ చేయాలి.. సినిమా టికెట్ల ధరలను కూడా పెంచాలి: సీఎం విజయ్‌కి విజయ్ సేతుపతి రిక్వెస్ట్

తమిళనాడు సీఎం విజయ్ ని మరో స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఓ రిక్వెస్ట్ చేశాడు. ప్రభుత్వమే ఓ ఓటీటీ మొదలుపెట్టాలని, అలాగే సినిమా టికెట్ల ధరలను కూడా పెంచాలని అతడు కోరాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి.

Published on: May 25, 2026, 15:48:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి (CM) విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై కోలీవుడ్ సినీ ప్రముఖులు తమ అభ్యర్థనలు, విజ్ఞప్తుల వర్షం కురిపిస్తున్నారు. దర్శకుడు పాండిరాజ్ రాబోయే మూవీ 'పరిమళ అండ్ కో' ఆడియో లాంచ్ వేడుకలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. సినిమా పరిశ్రమ మేలు కోసం సీఎం విజయ్‌కు రెండు కీలక విజ్ఞప్తులు చేశారు. మరోవైపు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపుపై నటుడు విశాల్ సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్టేజ్‌పై 'వాతి' నినాదాలు.. విజయ్ సేతుపతి రెండు కోరికలు

ప్రభుత్వమే ఓ ఓటీటీ స్టార్ట్ చేయాలి.. సినిమా టికెట్ల ధరలను కూడా పెంచాలి: సీఎం విజయ్‌కి విజయ్ సేతుపతి రిక్వెస్ట్
ప్రభుత్వమే ఓ ఓటీటీ స్టార్ట్ చేయాలి.. సినిమా టికెట్ల ధరలను కూడా పెంచాలి: సీఎం విజయ్‌కి విజయ్ సేతుపతి రిక్వెస్ట్

జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పరిమళ అండ్ కో' చిత్ర ఆడియో లాంచ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్టేజ్ పైకి రాగానే అభిమానులంతా 'వాతి' (Vaathi - మాస్టర్/గురువు) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

'మాస్టర్' సినిమాలో విజయ్ సేతుపతికి కో-స్టార్‌గా నటించి, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌ను ఉద్దేశించి అభిమానులు ఈ నినాదాలు చేయడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమను బతికించుకోవడానికి సీఎం విజయ్‌కు రెండు ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు.

ఓటీటీ స్టార్ట్ చేయండి

"గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సార్‌కి నాదొక ముఖ్యమైన విజ్ఞప్తి. ఇటీవల కమల్ హాసన్ సార్ కోరినట్లుగా, తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే సొంతంగా ఒక ప్రభుత్వ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఓటీటీ మార్కెట్ ఒకప్పుడు విపరీతంగా పుంజుకుని, ఆ తర్వాత ఎందుకో పడిపోయింది. దీనివల్ల బిజినెస్ పరంగా ఎన్నో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి క్రమబద్ధీకరించాలి" అని కోరారు.

అంతకుముందు లోకల్ బాడీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ రద్దు చేయాలని, థియేటర్లలో రోజుకు 5 షోలకు అనుమతి ఇవ్వాలని, బలమైన యాంటీ పైరసీ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఓటీటీ విడుదలకు కనీసం 8 వారాల లాక్-ఇన్ పీరియడ్ తప్పనిసరి చేయాలని కమల్ హాసన్ కూడా సీఎం విజయ్‌ను కోరిన సంగతి తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పరిమళ అండ్ కో' ఈవెంట్‌లో విజయ్ సేతుపతిని చూసి ప్రేక్షకులు ఎందుకు 'వాతి' అని నినాదాలు చేశారు?

విజయ్ సేతుపతి, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కలిసి గతంలో 'మాస్టర్' సినిమాలో నటించారు. అందులో విజయ్ పాత్ర పేరు 'వాతి' (మాస్టర్). విజయ్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, ఆ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ అభిమానులు ఆ విధంగా నినాదాలు చేశారు.

2. సీఎం విజయ్‌కు విజయ్ సేతుపతి చేసిన రెండు ప్రధాన విజ్ఞప్తులు ఏవి?

మొదటిది తమిళనాడు ప్రభుత్వం తరఫున ఒక అధికారిక ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం. రెండవది, పెరిగిన నిర్మాణ వ్యయానికి అనుగుణంగా థియేటర్ టికెట్ ధరలను పెంచడం.

3. సీఎం విజయ్ క్యాబినెట్ నిర్ణయంపై నటుడు విశాల్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు?

సినిమా రంగంపై పూర్తి అవగాహన ఉన్న సీఎం విజయ్ స్వయంగా చలనచిత్ర శాఖను ఉంచుకోకుండా, పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని మంత్రి రాజ్‌మోహన్‌కు 'ఫిలిం టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ చట్టం' శాఖను కేటాయించడంపై విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks