Vijayashanti: టాలీవుడ్ 'లేడీ అమితాబ్' విజయశాంతి (Vijayashanti) తన సినీ ప్రయాణంలో ఎదురైన ఊహించని అనుభవాలను బయటపెట్టి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. తన తొలి సినిమా పారితోషికంలో కొంత డబ్బును నిర్మాతలు ఎగ్గొట్టారని, అయినా పట్టు వదలకుండా పోరాడి బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటిగా చరిత్ర సృష్టించానని ఆమె వెల్లడించారు.
5 వేలల్లో 2 వేలు నొక్కేశారు

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించిన ఏకైక నటి విజయశాంతి. ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన షాకింగ్ సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.
తొలి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నిర్మాతలు రూ. 5,000 పారితోషికం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే చివరకు తన చేతిలో కేవలం రూ. 3,000 మాత్రమే పెట్టారని, మిగిలిన రూ. 2,000 ఎగ్గొట్టి మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే అంత పెద్ద దెబ్బ తగిలినా అధైర్యపడకుండా తన నటననే నమ్ముకుని ముందడుగు వేశానని విజయశాంతి చెప్పారు.
రూ. కోటి మార్క్ దాటిన తొలి ఇండియన్ హీరోయిన్
తొలి రెమ్యునరేషన్ లో చేదు అనుభవం ఎదురైనా, తన పవర్ ఫుల్ యాక్టింగ్, డెడికేషన్‌తో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 'ప్రతిఘటన', 'నేటి భారతం', 'స్వయంకృషి', 'గ్యాంగ్ లీడర్' లాంటి సినిమాలతో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ క్వీన్‌గా మారారు.
1990లో వచ్చిన ఐకానిక్ హిట్ 'కర్తవ్యం' సినిమాకి గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న విజయశాంతి.. ఆ తర్వాత రూ. కోటి పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగారు. ఆ కాలంలో ఒక నటికి రూ. కోటి రెమ్యూనరేషన్ ఇవ్వడం భారతీయ సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.
అమితాబ్, రజనీకాంత్‌లతో సమానంగా ఇండియా టుడే కవర్ పేజీ
ఆ రోజుల్లో టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం మీద హీరోలకు మించిన క్రేజ్ విజయశాంతి సొంతం. 'ఒసేయ్ రాములమ్మ' సినిమాతో థియేటర్లను షేక్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.
{{/usCountry}}ఆ రోజుల్లో టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం మీద హీరోలకు మించిన క్రేజ్ విజయశాంతి సొంతం. 'ఒసేయ్ రాములమ్మ' సినిమాతో థియేటర్లను షేక్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.
{{/usCountry}}తమ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రసిద్ధ 'ఇండియా టుడే' మ్యాగజైన్ కవర్ పేజీపై బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఫొటోలతో పాటు విజయశాంతి ఫొటోను ముద్రించారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ముగ్గురు టాప్ స్టార్స్ వీళ్లేనంటూ వచ్చిన ఆర్టికల్ అప్పట్లో నేషనల్ వైడ్‌గా పెద్ద సంచలనం సృష్టించిందని ఆమె గర్వంగా గుర్తుచేసుకున్నారు.
విజయశాంతి కంబ్యాక్, రాజకీయాలు ఇలా..
సినిమాల్లో రికార్డులు సృష్టించిన తర్వాత విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' (2020) సినిమాతో మళ్లీ రంగుల ప్రపంచంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.
లేడీ అమితాబ్‌గా టాలీవుడ్ హిస్టరీలో చెరగని ముద్ర వేసిన విజయశాంతి ప్రయాణం, సినీ పరిశ్రమలోకి వచ్చే ప్రతీ యంగ్ యాక్టర్‌కు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.