...
...
Next Story

Sehwag Review: ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.. ఆయనకు గొప్ప నివాళి: బ్లాక్‌బస్టర్ మూవీకి సెహ్వాగ్ రివ్యూ

Sehwag Review: ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిన హనుమాన్ అంశ్ సినిమాకు వీరేంద్ర సెహ్వాగ్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాను వర్ణించడానికి తనకు మాటలు చాలడం లేదని, నీమ్ కరోలి బాబాకు ఇది గొప్ప నివాళి అని అన్నారు.

Published on: Sep 3, 2026, 15:54:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sehwag Review: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఒక డివోషనల్ మూవీ చూసి పూర్తిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba) జీవిత ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సినిమాను చూసిన సెహ్వాగ్.. ఆ అనుభవాన్ని వివరిస్తూ ఒక లైవ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేశారు.

"కొన్ని అనుభవాలను వర్ణించడానికి మాటలు సరిపోవు!"

Sehwag Review: ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.. ఆయనకు గొప్ప నివాళి: హనుమాన్ అంశ్‌పై సెహ్వాగ్ రివ్యూ
Sehwag Review: ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.. ఆయనకు గొప్ప నివాళి: హనుమాన్ అంశ్‌పై సెహ్వాగ్ రివ్యూ

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "కొన్ని అనుభవాలు, కొందరు వ్యక్తుల గురించి చెప్పడానికి మన దగ్గర పదాలు చాలవు. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా అత్యంత ఆత్మీయ మిత్రులలో కొందరు నీమ్ కరోలి బాబా భక్తులు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నాకు మహారాజ్ జీ గురించి చెప్పాడు. నాటి నుంచి ఆయన వ్యక్తిత్వం, భక్తి, ఆశీస్సుల గురించి వింటూనే ఉన్నాను" అని చెప్పారు.

మహారాజ్ జీ అనుగ్రహం మనుషులలోని నిజమైన తత్వాన్ని బయటకు తెస్తుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఆయన జీవితానికి ఇచ్చిన అద్భుతమైన నివాళి అని కొనియాడారు.

సెహ్వాగ్‌ను కదిలించిన ఆ ఒక్క సీన్

సినిమాలో తనకు బాగా నచ్చిన ఒక సన్నివేశాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు సెహ్వాగ్. "మహారాజ్ జీ చుట్టూ పాములు ఉన్నప్పుడు, ఒక భక్తుడు వచ్చి ఆయనను శివుడిలాగే ఎంతో అమాయకుడని అంటాడు. దానికి మహారాజ్ జీ స్పందిస్తూ.. 'అమాయకుడు నేను కాదు, నువ్వు. మన హృదయంలో ఏది ఉందో మన కళ్ళు దాన్నే చూస్తాయి' అని బదులిస్తారు. ఈ సీన్ నన్ను ఎంతగానో తాకింది" అని చెప్పారు.

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చందన్ ఆనంద్, శోభినవ్ సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన తొలి రోజుల్లో పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా, మెల్లగా పాజిటివ్ 'వర్డ్ ఆఫ్ మౌత్' తో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కించగా.. ఇప్పటికే రూ.54 కోట్లకుపైగా వసూలు చేసింది.

తల్లిని కోల్పోయిన ఒక చిన్నారి దేవుడి కోసం వెతికే క్రమంలో నీమ్ కరోలి బాబాని కలవడం, మానవత్వానికి సేవ చేయడమే అసలైన భక్తి అని తెలుసుకోవడం ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాను బాబా గురించి తెలిసిన వాళ్లతో పాటు తెలియని వాళ్లు కూడా తప్పకుండా చూడాలని సెహ్వాగ్ కోరారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe