...
...
Next Story

Virosh Wedding: సందడిగా విరోష్ పెళ్లి వేడుకలు.. రష్మిక మందన్నకు అత్తగారి అపురూప కానుక.. కుటుంబ వారసత్వ గిఫ్ట్!

Virosh Wedding: ఉదయ్‌పూర్‌లో అత్యంత సందడిగా విరోష్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సంగీత్ ఈవెంట్లో కాబోయే కోడలు రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి అపురూపమైన కానుక ఇచ్చినట్లు తెలిసింది.

Published on: Feb 25, 2026, 12:37:35 IST
Advertisement

విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఉదయ్‌పూర్‌ లో ఈ జంట వివాహ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన సంగీత్ లో కాబోయే కోడలికి విజయ్ దేవరకొండ అమ్మ మాధవి అపురూమైన బహుబతి అందించిందని తెలిసింది. తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను కాబోయే కోడలికి అత్తగారు ప్రజెంట్ చేశారని సమాచారం.

రష్మికకు అత్త గిఫ్ట్

రష్మికకు అత్తగారి గిఫ్ట్ (instagram)
రష్మికకు అత్తగారి గిఫ్ట్ (instagram)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతుంది. అంతకంటే ముందు ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వహించిన సంగీత్ లో రష్మికకు మాధవి దేవరకొండ తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను బహుమతిగా ఇచ్చారని తెలిసింది.

ఎమోషనల్ మూమెంట్

సంగీత్ వేడుకలో రష్మికకు మాధవి బంగారు గాజులు ఇవ్వడంతో అక్కడ ఎమోషనల్ వాతావరణం నెలకొందని సమాచారం. అది ఒక అందమైన కుటుంబ సన్నివేశంలా అందరి మనసులను హత్తుకుందని తెలిసింది. వివాహ ఆచారాల్లో భాగంగా తమ కుటుంబ వారసత్వమైనా ఈ గాజులను రష్మికకు మాధవి అందించారని తెలిసింది.

ప్రేమతో వెల్ కమ్

రష్మికకు బంగారు గాజులు అందించిన మాధవి తన కాబోయే కోడలిని ప్రేమగా కుటుంబంలోకి ఆహ్వానించారు. తరతరాలుగా వస్తున్న ఈ కుటుంబ వారసత్వ గాజులకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసింది. ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ లా వాళ్లు ఫీల్ అవుతున్నారు. రేపు (ఫిబ్రవరి 26) అంగరంగ వైభవంగా విరోష్ వెడ్డింగ్ జరగబోతుంది.

సందడే సందడి

అంతకంటే ముందు పూల్ లో వాలీబాల్ ఆడుతున్న ఫొటోను విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు. ఈ విరోష్ వెడ్డింగ్ కోసం తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ తదితర సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. గురువారం విరోష్ వెడ్డింగ్ తెలుగు, కొడవ సంప్రదాయాల్లో జరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks