Vishnu Manchu: మిస్సైల్స్ మధ్య భయంభయంగా ఉన్నాం: దుబాయ్‌ ఆకాశంలో మిస్సైల్స్ వీడియో షేర్ చేసిన విష్ణు మంచు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు దుబాయ్‌ను వణికించాయి. కుటుంబంతో కలిసి వెళ్లిన మంచు విష్ణు క్షిపణి దాడుల భీభత్సాన్ని స్వయంగా చూసి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, నటి సోనాల్ చౌహాన్ కూడా అక్కడే చిక్కుకుపోయారు.

Published on: Mar 1, 2026, 14:55:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం అక్కడ నివసిస్తున్న సామాన్యులతో పాటు ఇండియన్ సెలబ్రిటీలను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో దుబాయ్, అబుదాబి పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ భీకర పరిస్థితుల్లో ‘కన్నప్ప’ నటుడు మంచు విష్ణు కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.

Vishnu Manchu: మిస్సైల్స్ మధ్య భయంభయంగా ఉన్నాం: దుబాయ్‌ ఆకాశంలో మిస్సైల్స్ వీడియో షేర్ చేసిన విష్ణు మంచు
Vishnu Manchu: మిస్సైల్స్ మధ్య భయంభయంగా ఉన్నాం: దుబాయ్‌ ఆకాశంలో మిస్సైల్స్ వీడియో షేర్ చేసిన విష్ణు మంచు

ఆకాశంలో క్షిపణులు.. వణికిపోయిన చిన్నారి

తమ బంధువులను కలిసేందుకు దుబాయ్ వెళ్లిన మంచు విష్ణు.. అక్కడి ఆకాశంలో మిస్సైల్స్ దూసుకుపోతున్న భయంకరమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. క్షిపణులను అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలకు తన ఇల్లు కంపించిందని, తన చిన్న కూతురు ఐరా ప్రాణభయంతో వణికిపోయిందని విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు.

"ఏ చిన్నారి కూడా తన ఇంటి పైకప్పు పైన యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు. శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను. పౌరులను రక్షిస్తున్న యూఏఈ రక్షణ దళాలకు ధన్యవాదాలు. జీవితం ఎంత బలహీనమైనదో ఇలాంటి క్షణాలు గుర్తుచేస్తాయి" అని అతడు పేర్కొన్నాడు.

ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం

మరోవైపు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు వెళ్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆమె గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వచ్చింది.

తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోనే ఒక పేలుడు సంభవించిందని, తన కోచ్ పొగ, శిథిలాల మధ్య నుంచి ప్రాణాలతో బయటపడ్డారని సింధు వివరించింది. ప్రస్తుతం భారత హైకమిషన్ సాయంతో తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఆమె తెలిపింది.

ప్రధాని మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సోనాల్ చౌహాన్ కూడా విమానాలు రద్దు కావడంతో దుబాయ్‌లోనే ఉండిపోయింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తాను భారత్ చేరుకోవడానికి మార్గం కనిపించడం లేదని, తగిన మార్గదర్శకత్వం చేయాలని ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా వేదికగా విన్నవించుకోవడం విశేషం.

అసలేం జరుగుతోంది?

ఇజ్రాయెల్ తమ సుప్రీం లీడర్‌ను హతమార్చినందుకు నిరసనగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి దాడులకు దిగింది. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాచి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రభావం మిడిల్ ఈస్ట్ మొత్తం కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More