PM Modi : దట్​ ఈజ్​ మోదీ.. 10 కోట్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా రికార్డు! దరిదాపుల్లో కూడా లేని ట్రంప్​..

PM Modi Instagram : సోషల్ మీడియాలో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇన్ స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్లను సాధించిన తొలి ప్రపంచ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. గ్లోబల్ లీడర్లందరిలోనూ మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

Published on: Feb 26, 2026, 06:46:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే క్రేజ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై రికార్డుల సునామీ సృష్టిస్తోంది! ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఇన్‌స్టాగ్రామ్'లో 100 మిలియన్ల (10కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని దాటిన తొలి ప్రపంచ రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆయన, కేవలం 12ఏళ్ల కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (PTI)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (PTI)

ప్రపంచ నేతలందరూ కలిసినా.. మోదీ తర్వాతే!

ప్రధాని మోదీ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందంటే, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి.. రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మోదీ తర్వాత ఉన్న టాప్-5 ప్రపంచ నాయకుల ఫాలోవర్ల సంఖ్యను కలిపినా మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల కంటే తక్కువగానే ఉంటుంది.

ప్రపంచ నేతల ఫాలోవర్ల వివరాలు:

నరేంద్ర మోదీ (భారత్): 100 మిలియన్లు (10 కోట్లు)

డొనాల్డ్ ట్రంప్ (అమెరికా): 43.2 మిలియన్లు

ప్రబోవో సుబియాంటో (ఇండోనేషియా): 15 మిలియన్లు

లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా (బ్రెజిల్): 14.4 మిలియన్లు

తయ్యిప్ ఎర్డోగాన్ (టర్కీ): 11.6 మిలియన్లు

జేవియర్ మైలీ (అర్జెంటీనా): 6.4 మిలియన్లు

భారతీయ రాజకీయ నాయకుల్లో కూడా మోదీకి, ఇతరులకు మధ్య భారీ వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 12.6 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ప్రధాని మోదీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​..
ప్రధాని మోదీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​..

అప్రూవల్ రేటింగ్‌లోనూ నంబర్ వన్!

కేవలం ఫాలోవర్ల సంఖ్యలోనే కాదు, ప్రజల ఆమోదం (అప్రూవల్​ రేటింగ్​) పొందే విషయంలోనూ మోదీ తిరుగులేని నాయకుడిగా నిలిచారు. తాజాగా అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్' అనే ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం (ఫిబ్రవరి 2026):

నరేంద్ర మోదీ: 67 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రథమ స్థానంలో ఉన్నారు.

ఆండ్రీ బాబిస్ (చెక్ రిపబ్లిక్): 59 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు.

డొనాల్డ్ ట్రంప్ (అమెరికా): 40 శాతంతో 11వ స్థానానికి పరిమితమయ్యారు.

అంతకుముందు 2025 డిసెంబర్‌లో 'స్టాటిస్టా' వెల్లడించిన నివేదికలోనూ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70 శాతం రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవడం ఆయన స్థిరమైన ప్రజాదరణకు నిదర్శనం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతను ఆకట్టుకోవడంలో మోదీ డిజిటల్ వ్యూహాలు విజయవంతమవుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న- ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల మార్కును దాటిన తొలి రాజకీయ నేత ఎవరు?

సమాధానం- భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి రాజకీయ నాయకుడు, గ్లోబల్ లీడర్. ఫిబ్రవరి 2026 నాటికి ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు (100 మిలియన్లు) దాటింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రధాని మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉండటం విశేషం.

ప్రశ్న- 2026 తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు?

సమాధానం- ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ప్రజాస్వామ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. 'మార్నింగ్ కన్సల్ట్' ఫిబ్రవరి 2026 నివేదిక ప్రకారం, మోదీ 67 శాతం అప్రూవల్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచారు. 2025లో కూడా ఆయన 70 శాతం కంటే ఎక్కువ రేటింగ్‌తో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

ప్రశ్న- సోషల్ మీడియాలో ఇతర ప్రపంచ నేతలతో పోలిస్తే మోదీ స్థానం ఏమిటి?

సమాధానం- డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మోదీ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాయకుడిగా ఉన్నారు. మోదీ తర్వాత స్థానాల్లో ఉన్న టాప్-5 అంతర్జాతీయ నేతల (డొనాల్డ్ ట్రంప్, ప్రబోవో సుబియాంటో తదితరులు) అందరి ఫాలోవర్లను కలిపినా.. మోదీ ఒక్కరి ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగానే ఉండటం ఆయన గ్లోబల్ రీచ్‌కు నిదర్శనం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More