Modi On Virosh Wedding: ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. విరోష్ వెడ్డింగ్.. రష్మిక, విజయ్ కు ప్రధాని మోదీ స్పెషల్ లెటర్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ లెటర్ ద్వారా ఈ జంటను ఆశీర్వదించారు. వీళ్లది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మోదీ పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రేపు (ఫిబ్రవరి 26) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గురువారం ఉదయ్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు రష్మిక, విజయ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఓ స్పెషల్ లెటర్ ద్వారా పీఎం తన ఆశీర్వాదాన్ని పంపించారు.

ప్రధాని శుభాకాంక్షలు
విరోష్ వెడ్డింగ్ సందర్భంగా మందన్న, దేవరకొండ కుటుంబాలకు, కాబోయే కొత్త దంపతులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ లెటర్ ను పంపించారు. ఈ లేఖను విజయ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది" అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
కొత్త అధ్యాయం
"2026 ఫిబ్రవరి 26న జరగనున్న విజయ్, రష్మికల వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఎంతో సంతోషకరమైన ఈ శుభ సందర్భంగా దేవరకొండ, మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. అలాగే శుభాకాంక్షలు. ఇది విజయ్, రష్మిక జీవితాల్లో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది’’ అని లెటర్ లో పీఎం మోదీ తెలిపారు.
దేవుడి స్క్రిప్ట్
‘‘ 'సఖ సప్తపద భవ' స్ఫూర్తితో.. ఏడు అడుగులు కలిసి నడిచిన తర్వాత దంపతులు జీవితకాల స్నేహితులుగా మారతారు. విజయ్, రష్మికకు సినిమా స్క్రిప్ట్ లు కొత్తేం కాదు. కానీ ఇది వాళ్ల జీవితాల్లో ప్రేమ, ఆప్యాయత నిండేలా దేవుడు రాసిన స్క్రిప్ట్. సిల్వర్ స్క్రీన్ పై వీళ్లు క్రియేట్ చేసిన మ్యాజిక్ ను ఈ దేవుడి స్క్రిప్ట్ కచ్చితంగా దాటేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.

నిజమైన పార్ట్ నర్స్ గా
‘‘పంచుకున్న కలలు, వాటిని నెరవేర్చుకునే లక్ష్యంతో వీళ్ల రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండాలి. ఆలోచన, ప్రేమతో వాళ్లు బాధ్యతలను పంచుకోవాలి. ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోవాలి. ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవాలి. నిజమైన పార్ట్ నర్స్ లా లైఫ్ జర్నీని కొనసాగించాలి’’ అని లెటర్ లో పీఎం మోదీ తెలిపారు.
‘‘ఈ గొప్ప సందర్భంలో ఆ దంపతులకు, కుటుంబాలకు నా ఆశీర్వాదాలు, అభినందనలు’’ అని మోదీ లెటర్ లో పేర్కొన్నారు.
విరోష్ వెడ్డింగ్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు స్టార్ట్ చేశారు. మార్చి 4న హైదరాబాద్ లో రష్మిక, విజయ్ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


