Vishnu Vinyasam OTT: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు నటించిన మరో కామెడీ మూవీ విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. శుక్రవారం (మార్చి 20) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చింది.
విష్ణు విన్యాసం ఓటీటీ

శ్రీవిష్ణు, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటించిన మూవీ విష్ణు విన్యాసం. యదునాథ్ మారుతి రావు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. సడెన్ గా శుక్రవారం నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. నిజానికి దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఏమీ లేదు. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఊహించినదాని కంటే ముందుగానే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
విష్ణు విన్యాసం మూవీ విశేషాలు
టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పేరు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటించి లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ విష్ణు విన్యాసం. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఇందులో జాతకాల పిచ్చి బాగా ఉన్న చిన్ను అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో శ్రీవిష్ణు నటించాడు.
తన కాలేజీలోనే పని చేసే మనీషా (నయన్ సారిక)ను ప్రేమించినా.. ఆమె జాతకంలో దోషం వల్ల పెళ్లికి చిన్ను వెనుకాడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? మనీషాకు ఉన్న జాతక దోషం ఏంటీ? దోషం ఉందని తెలిసి కూడా విష్ణు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇద్దరి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే? విష్ణు విన్యాసం చూడాల్సిందే.
పెద్దగా అంచనాలు లేకుండా కేవలం కాసేపు నవ్వుకోవడానికి అయితే ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉన్న విష్ణు విన్యాసం మూవీని చూడొచ్చు.
{{/usCountry}}పెద్దగా అంచనాలు లేకుండా కేవలం కాసేపు నవ్వుకోవడానికి అయితే ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉన్న విష్ణు విన్యాసం మూవీని చూడొచ్చు.
{{/usCountry}}