మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు, ఆ సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ 4 నెలలు సినిమాలు బాగా కొంటున్నారు: హీరో శ్రీవిష్ణు

వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవిష్ణు రీసెంట్‌గా జరిగిన కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. మూవీ థియేట్రికల్ విడుదలకు ముందు జరిగిన ఈ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Feb 20, 2026, 12:53:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా యంగ్ హీరో శ్రీవిష్ణు పేరు తెచ్చుకున్నాడు. వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండు సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు, ఆ సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ 4 నెలలు సినిమాలు బాగా కొంటున్నారు: హీరో శ్రీవిష్ణు
మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు, ఆ సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ 4 నెలలు సినిమాలు బాగా కొంటున్నారు: హీరో శ్రీవిష్ణు

రెండు రోజుల ముందు

అయితే, ఇటీవల థియేట్రికల్ రిలీజ్‌కు రెండు రోజులో ముందు నిర్వహించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హీరో శ్రీవిష్ణు హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నా సొంత సినిమాల

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "యూవీ మూవీ అంటే నా సొంత సినిమాలా భావిస్తా. నేను ఈ సంస్థలో ఒక మూవీ చేశాను. ఈ బ్యానర్‌లో అన్నీ బాగుంటాయి. మనల్ని ఎంతగానో లవ్ చేస్తారు" అని అన్నారు.

నేచురల్‌గా నటిస్తాడు

"గోల్కొండ హైస్కూల్ సినిమా నుంచే సంతోష్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. మంచి పర్‌ఫార్మర్. నేచురల్‌గా నటిస్తాడు. సినిమాల్లో కూడా మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు. ఈ సినిమాతో ఆయనకు సూపర్ హిట్ దక్కాలని కోరుకుంటున్నా. మంచి యాక్టర్స్‌ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ లవ్ మీపై కూడా చూపిస్తారు" అని శ్రీవిష్ణు ఆశించాడు.

ప్రతి సంక్రాంతికి సక్సెస్ ఇవ్వాలి

"అనిల్ (డైరెక్టర్ అనిల్ రావిపూడి) గారు ప్రతి సంక్రాంతికి సక్సెస్ ఇవ్వాలి. ఆయన ఇచ్చే సంక్రాంతి సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత మూడు నాలుగు నెలలు సినిమాలు బాగా కొంటున్నారు. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, మ్యూజిక్, మిగతా అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అని శ్రీవిష్ణు తెలిపాడు.

షార్ట్ ఫిలింస్‌కు వర్క్ చేశాం

మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ మాట్లాడుతూ.. "ఇది నాకు ఫస్ట్ మూవీ. గతంలో డైరెక్టర్ అశ్విన్, నేను కలిసి షార్ట్ ఫిలింస్‌కు వర్క్ చేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి మ్యూజిక్ చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూవీ సంస్థ ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మా సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి" అని కోరారు.

తెలుగు, తమిళ భాషల్లో

ఇదిలా ఉంటే, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్, మానస వారణాసి నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మించింది. ఆ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.

పాజిటివ్ టాక్

తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో థియేటర్లలో విడుదల అయింది. రిలీజ్ డే నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More