నీ అక్క అని వదిననే కదా అన్నది.. అది హుక్ స్టెప్ కాదు ఆశీర్వాదం.. ఆ పెను ప్రమాదం తప్పింది: శ్రీవిష్ణు కామెంట్స్

యాక్టర్ శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు నటించిన విష్ణు విన్యాసం మూవీ టీజర్ బుధవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 18, 2026, 18:42:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు శ్రీవిష్ణు నటించిన మూవీ విష్ణు విన్యాసం (Vishnu Vinyasam). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ పిచ్చి ఉండే వ్యక్తిగా ఇందులో అతడు నటించాడు. టీజర్ ఫన్నీగా సాగిపోగా.. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి.

నీ అక్క అని వదిననే కదా అన్నది.. అది హుక్ స్టెప్ కాదు ఆశీర్వాదం.. ఆ పెను ప్రమాదం తప్పింది: శ్రీవిష్ణు కామెంట్స్
నీ అక్క అని వదిననే కదా అన్నది.. అది హుక్ స్టెప్ కాదు ఆశీర్వాదం.. ఆ పెను ప్రమాదం తప్పింది: శ్రీవిష్ణు కామెంట్స్

నీ అక్క డైలాగుపై..

శ్రీవిష్ణు నటిస్తున్న విష్ణు విన్యాసం మూవీ టీజర్ బుధవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది. తన మార్క్ కామెడీతో ఈ మూవీలోనూ అతడు నవ్వించబోతున్నాడు. అయితే ఇందులో నీ అక్క అనే ఓ డైలాగు శ్రీవిష్ణు నోటి వెంట వచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్.. గతంలో శివయ్య అనే డైలాగు వివాదాస్పదమైంది.. మరి ఇందులో నీ అక్క అని అనడాన్ని ఎలా సమర్థించుకుంటారు అని అడిగారు. దీనికి శ్రీవిష్ణు స్పందిస్తూ.. నీ అక్క అని అన్నాను.. వదిననే కదా అన్నాను అంటూ పక్కనే ఉన్న నయన్ సారికను చూపించాడు. అది విని అక్కడి అభిమానులు అరిచారు.

ఆ రెండు సినిమాలు ఒకేసారి రావట..

శ్రీవిష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసం ఒక్కటే కాదు.. మృత్యుంజయ అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో దీనిపై శ్రీవిష్ణు స్పందించాడు. ఆ పెను ప్రమాదం తప్పిందని, దీనిపై రేపు (గురువారం) అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఒకే రోజు కాదు.. ఒకే వారంలో కూడా ఆ సినిమాలు రావడం లేదని అతడు స్పష్టం చేశాడు.

అది హుక్ స్టెప్పు కాదు..

ఇక విష్ణు విన్యాసం సినిమాలో తాను వేసిన హుక్ స్టెప్ గురించి ప్రశ్నించగా.. శ్రీవిష్ణు ఫన్నీగా సమాధానమిచ్చాడు. అది హుక్ స్టెప్ కాదని, ఆశీర్వాదమని, అది సినిమా చూస్తే మీకే తెలుస్తుందని అనడం విశేషం.

చివరి 10 నిమిషాలు అందరికీ నచ్చుతుంది..

విష్ణు విన్యాసం సినిమా గురించి శ్రీవిష్ణు మాట్లాడాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కుర్రాళ్లకు బాగా నచ్చుతుందని చెప్పాడు. ఇక సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చుతుందని అన్నాడు. చివరి 10 నిమిషాలు మాత్రం అటు కుర్రాళ్లకి, ఇటు ఫ్యామిలీ అందరికీ నచ్చుతుందని స్పష్టం చేశాడు.

విష్ణు విన్యాసం సినిమాను యదునాథ్ మారుతి డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. ఇందులో ఆయ్, క మూవీ ఫేమ్ నయన్ సారిక ఫిమేల్ లీడ్ గా నటించింది. సుమంత నాయుడు జి నిర్మించాడు. ఒంగోలు బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాకు రాధన్ మ్యూజిక్ అందించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More