డ్యాన్స్ ఇరగదీసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి డైరెక్టర్-రవితేజ, హీరోయిన్లతో కలిసి హుక్ స్టెప్-వీడియో వైరల్
డైరెక్టర్లు అంటే సినిమా తీసేస్తారు. రిలీజ్ చేస్తారు. తెరవెనకాలే కష్టపడతారు. వాళ్ల బయట ఎక్కువగా వైరల్ అవరు. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి డైరెక్టర్ కిశోర్ తిరుమల మాత్రం ఛాన్స్ దొరకగానే డ్యాన్స్ తో రెచ్చిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
సంక్రాంతి పండగకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ది రాజా సాబ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తిపై మంచి బజ్ నెలకొంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కిశోర్ తిరుమల డ్యాన్స్ వైరల్ గా మారింది.

డైరెక్టర్ డ్యాన్స్
సాధారణంగా డైరెక్టర్లు తెరవెనకాలే కష్టపడుతుంటారు. తమ కలల సినిమాను రెడీ చేస్తారు. బయట ఎక్కువగా కనిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రమోషన్లలోనూ డైరెక్టర్లు డిఫరెంట్ దారిలో వెళ్తున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు ప్రమోషన్లను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా డ్యాన్స్ తో అదరగొట్టాడు.
వైరల్ వీడియో
శనివారం (జనవరి 10) రాత్రి జరిగిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కిశోర్ తిరుమల డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. ఈ సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ సాంగ్ హుక్ స్టెప్ ను కిశోర్ తిరుమల పర్ఫెక్ట్ గా వేయడం విశేషం. రవితేజ, హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతితో పాటు హరీష్ శంకర్, బాబీ లాంటి డైరెక్టర్లు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే కిశోర్ తిరుమల స్టెప్స్ మాత్రం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
వరుస ఫ్లాప్ లు ఎదురవడంతో మాస్ ఇమేజీని పక్కనపెట్టి రవితేజ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. ఇందులో పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా నటించాడు రవితేజ. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ఇద్దరు హీరోయిన్లు. పెళ్లైన తర్వాత తన భర్త మరో అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని తెలిసిన భార్య ఏం చేసింది? ఇద్దరి మధ్యలో భర్త ఎలా నలిగిపోయాడన్నది భర్త మహాశయులకు విజ్ఞప్తి కథగా తెలుస్తోంది.
కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతోనైనా రవితేజ ఓ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


