రూట్ మార్చిన రవితేజ- మాస్ మహారాజ్ ట్యాగ్ వద్దంటూ- టికెట్ రేట్ల పెంపు కూడా లేదు
వరుసగా ఊకదంపుడు మాస్ సినిమాలతో థియేటర్లకు రావడం, ఫ్లాప్ మూటగట్టుకోవడం రవితేజకు అలవాటుగా మారింది. అందుకే ఈ ఫ్లాప్ ల నుంచి బయటపడేందుకు రూట్ మార్చాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. మాస్ మహారాజ్ ట్యాగ్ కూడా వద్దంటున్నాడు.
వరుస ఫ్లాప్ లకు చెక్ పెట్టేందుకు, మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు రవితేజ రూట్ మార్చాడు. తనకు మాస్ ఇమేజీని తెచ్చిన మాస్ మహారాజ్ ట్యాగ్ ను కూడా పక్కనపెట్టేశాడు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

మాస్ మహారాజ్ కాదు
సాధారణంగా రవితేజను మాస్ మహారాజ్ అని పిలుస్తారు. సినిమా టైటిల్స్ లోనూ ఈ ట్యాగ్ వేస్తారు. తన యాక్టింగ్ తో, మాస్ సినిమాలతో అతను ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పాడంటా. ఈ విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించాడు.
రూట్ మార్చి
మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వరుసగా మాస్ సినిమాలతో ఫ్లాప్ లు మూటగట్టుకున్నాడు రవితేజ. మరొకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పూర్తిగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. అందుకే ఆ ట్యాగ్ వద్దన్నాడని అంటున్నారు. ఈ మార్పు కలిసొచ్చి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కితే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
టికెట్ రేట్లు
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పుడు ఏ పెద్ద హీరో సినిమా రిలీజైన టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండదని మేకర్స్ క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఇటీవల టికెట్ రేట్ల పెంపు కోసమని తమ దగ్గరకు రావొద్దని రేవంత్ రెడ్డి సర్కారులోని మంత్రులు అంటున్నారు. మరోవైపు రవితేజకు కూడా హిట్ కావాలి. అందుకే టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టోరీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ భార్య డింపుల్ హయాతి. రవితేజ ఏహో ఆషికా రంగనాథన్ తో సంబంధం పెట్టుకుంటాడు.
తన ప్రియురాలి విషయం భార్యకు తెలియకుండా, మోసం చేస్తున్నామోననే బాధలో రవితేజ ఉంటాడు. మరోవైపు భర్తను పూర్తిగా నమ్ముతుంది భార్య. ఇక ఆషికాకు రవితేజ భార్య విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


