OTT: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలోకి మూవీగా వస్తున్న బోల్డ్ సిరీస్.. ఎక్కువ మంది చూసిన ఒరిజినల్ సిరీస్ గా రికార్డు
ఓటీటీని షేక్ చేసిన ఓ బోల్డ్ సిరీస్ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలోని రిలీజ్ చేయబోతున్నారు.
ఓటీటీని షేక్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ సీజన్ 2. ఈ సిరీస్ లోని సీజన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొట్టింది. ఇప్పుడీ ఈ సీజన్ సినిమాగా మారి నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.

3 రోజెస్ సీజన్ 2 మూవీ ఓటీటీ
బోల్డ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 సినిమాగా రాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా వీడియో ఓటీటీలో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో ఇవాళ (ఫిబ్రవరి 12) అనౌన్స్ చేసింది.
‘‘ఈ వాలెంటైన్స్ డే రోజు మేం రోజెస్ ఇవ్వట్లేదు. బోల్డ్ స్టోరీలను రిలీజ్ చేస్తున్నాం. 3 రోజెస్ సీజన్ 2 ది మూవీ ఫిబ్రవరి 14న ఆహాలో రిలీజ్ కానుంది’’ అని ఎక్స్ లో ఆహా వీడియో పోస్టు చేసింది.
3 రోజెస్ గురించి
ఆహా ఒరిజినల్ సిరీస్ గా ఓటీటీలోకి వచ్చిన 3 రోజెస్ సంచలనంగా మారింది. ఈ బోల్డ్ సిరీస్ సీజన్ 1 నవంబర్ 12, 2021లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ కు తెగ క్రేజ్ వచ్చింది. దీంతో 2025 డిసెంబర్ 13న 3 రోజెస్ సీజన్ 2ను రిలీజ్ చేశారు. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తం 6 ఎపిసోడ్ల సిరీస్ ఇది.
ఆ రికార్డు
3 రోజెస్ సీజన్ 2 ఇప్పటికే ఆహా ఓటీటీలో రికార్డు నమోదు చేసింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది చూసిన ఒరిజినల్ సిరీస్ గా ఈ సీజన్ 2 నిలిచింది. ఇందులో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు లీడ్ రోల్స్ ప్లే చేశారు.
3 రోజెస్ సీజన్ 2 స్టోరీ
రితిక అలియాస్ రీతూ (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్), సృష్టి (కుషిత కల్లపు) ముగ్గురు ముంబైలో ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. బ్రేకప్ అయిన రీతూ కెరియర్‌పై ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. విడాకులు తీసుకున్న మేఘన ఆ విషయాన్ని తమ కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది.
మరోవైపు కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టపడే సృష్టి మాత్రం కొత్త వ్యక్తులతో డేటింగ్ చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి కొత్త యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. దాన్ని రన్ చేసేందుకు చాలా కష్టడుతుంటారు. కానీ, వారికి ఒక్క క్లయింట్ కూడా రాడు.
ఈ సమయంలోనే, రీతూ పెళ్లికి రెజెక్ట్ చేసిన ప్రసాద్ (హర్ష చెముడు) వారికి తన గోల్డ్ జ్యూవెలరీ ప్రాజెక్ట్ యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితుల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటీ? ఆ యాడ్ చేసేందుకు ముగ్గురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? యాడ్ ఎజెన్సీ ఎలా పెట్టారు? భర్తతో మేఘనకు ఉన్న సమస్య ఏంటీ? ప్రసాద్ గురించి తెలిసిన నిజం ఏంటీ? ముగ్గురు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు? అనేది తెలియాలంటే ఈ 3 రోజెస్ సీజన్ 2 చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


