...
...
Next Story

షారుక్ ఖాన్ ఎవరు అని అడగొచ్చు.. ఎంతటి వాళ్లయినా చరిత్రకే పరిమితమవుతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంత గొప్పవాళ్లయినా ఏదో ఒక నాటికి చరిత్రకే పరిమితమవుతారని, శూన్యంగా మిగిలిపోతారని అతడు అనడం విశేషం. ఇంతకీ అతడు ఎందుకలా అన్నాడో చూడండి.

Published on: Nov 20, 2025, 22:05:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటుడు వివేక్ ఒబెరాయ్.. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కీర్తి కాలక్రమేణా మసకబారే అవకాశం ఉందని, భవిష్యత్ తరాలకు అతని గురించి తెలియకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడు ఇటీవల పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. కీర్తి అనేది అస్థిరమైనదని, పరిమిత కాలానికే ఉంటుందని అతడు అన్నాడు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వివేక్ ఒబెరాయ్ ఏమన్నాడంటే?

షారుక్ ఖాన్ ఎవరు అని అడగొచ్చు.. ఎంతటి వాళ్లయినా చరిత్రకే పరిమితమవుతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్
షారుక్ ఖాన్ ఎవరు అని అడగొచ్చు.. ఎంతటి వాళ్లయినా చరిత్రకే పరిమితమవుతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్

ఎంతటి వారికైనా వాళ్ల కీర్తి.. కాలంతో పాటు ఎలా కనుమరుగవుతుందో వివరిస్తూ వివేక్ ఒబెరాయ్ ఇలా అన్నాడు. "1960ల నుండి ఏదైనా సినిమా గురించి, అందులో నటించిన నటుల గురించి మీరు ఈ రోజు ఎవరినైనా అడగండి. ఎవరూ పట్టించుకోరు. మీరు అనివార్యంగా చరిత్రకు పరిమితమవుతారు. 2050లో ప్రజలు 'షారుక్ ఖాన్ ఎవరు?' అని అడగవచ్చు" అని వివేక్ అన్నాడు.

ఇదే చర్చలో వివేక్ ఒబెరాయ్.. దివంగత నటుడు రాజ్ కపూర్ కూడా ఉదహరించారు. "ఈ రోజు ప్రజలు 'ఎవరు రాజ్ కపూర్?' అని అడగవచ్చు. మీరు, నేను ఆయనను సినిమా దేవుడిగా పిలవవచ్చు. కానీ మీరు రణబీర్ కపూర్ అభిమాని అయిన ఏ యువకుడిని అడిగినా వారికి రాజ్ కపూర్ ఎవరో కూడా తెలియకపోవచ్చు. కాబట్టి బహుశా చరిత్ర చివరికి మనందరినీ శూన్యంలోకి నెట్టివేస్తుంది" అని వివేక్ అన్నాడు. రణ్‌బీర్ కపూర్ తాత రాజ్ కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ లో పెద్ద స్టార్.

షారుక్ ఖాన్ గురించి

షారుక్ ఖాన్ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి రొమాంటిక్ చిత్రాలలో తన ఐకానిక్ పాత్రలతో గ్లోబల్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ఈ నెల ప్రారంభంలో షారుక్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో అతడు అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' చిత్రంలో నటనకు గాను ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడికి జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. షారుక్ తన తదుపరి చిత్రం ‘కింగ్’లో కనిపించనున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe