...
...
Next Story

Vrushakarma Trailer: ఆ దైవమే ఎంచుకున్న వృష‌క‌ర్మ‌-ఇది అస‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు-ఊహాకు అంద‌ని విధంగా వృష‌క‌ర్మ ట్రైల‌ర్

Vrushakarma Trailer: కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య మూవీ అనగానే వృష‌క‌ర్మ‌పై అంచనాలు కలిగాయి. ఏదో పురాతన తవ్వకాలు, శాస్త్రవేత్త అనగానే ఆసక్తి పెరిగింది. కానీ మూవీ ఇలా ఉండబోతుందని, ఊహకు అందకుండా థ్రిల్ చేయబోతుందోనని ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా రిలీజైన వృష‌క‌ర్మ‌ ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది మరి.

Published on: Nov 26, 2026, 10:56:30 IST
Advertisement

Vrushakarma Trailer: విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ను భయపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు.. ఇప్పుడు నాగ చైతన్య అంతకుమించిన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇవాళ (నవంబర్ 26) రిలీజైన వృష‌క‌ర్మ‌ ట్రైలర్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ లెవల్ లో ట్రైలర్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు.

వృష‌క‌ర్మ‌ ట్రైలర్

ఆ దైవమే ఎంచుకున్న వృష‌క‌ర్మ‌-ఇది అస‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు-ఊహాకు అంద‌ని విధంగా వృష‌క‌ర్మ ట్రైల‌ర్
ఆ దైవమే ఎంచుకున్న వృష‌క‌ర్మ‌-ఇది అస‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు-ఊహాకు అంద‌ని విధంగా వృష‌క‌ర్మ ట్రైల‌ర్

ఆలస్యంగా వచ్చినా కూడా వృష‌క‌ర్మ‌ ట్రైలర్ అదరగొట్టింది. నిజానికి బుధవారం (నవంబర్ 25) ఈ ట్రైలర్ ను నెల్లూరు ఈవెంట్లో రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. అక్కడ బిగ్ స్క్రీన్ పై ప్లే చేశారు. కానీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసే టైమ్ లో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది. దీంతో ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు.

బ్లాక్ బస్టర్ ఖాయం

గురువారం ఉదయం వృష‌క‌ర్మ‌ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. ట్రైలర్ మామూలుగా లేదనే అందరూ అంటున్నారు. ఇమాజినేషన్ కు అందకుండా ఉందని కామెంట్లు పెడుతున్నారు. నాగ చైతన్యకు వృష‌క‌ర్మ‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ సోషల్ మీడియాను నెటిజన్లు షేక్ చేస్తున్నారు.

అదిరిపోయిన విజువల్స్

వృష‌క‌ర్మ‌ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగిపోయాయి. ఇందులో మిస్టరీ, సస్పెన్స్, హారర్, మైథికల్.. ఇలా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే థ్రిల్లర్ అంశాలన్నీ ఉన్నాయి. పురాతన తవ్వకాల్లో ఓ అతీంద్రియ శక్తి బయటకు వస్తుంది. అది భూమ్మీద వినాశనానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఆపేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. ఇదే క్లుప్తంగా వృష‌క‌ర్మ‌ మూవీ స్టోరీ. కానీ దాన్ని తెరకెక్కించిన తీరు, కనిపించే విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

గబ్బిళాలతో

‘‘మనకు అందని సైన్స్ సార్ వాళ్లది.. వేదిక్ సైన్స్’’ అని హీరో నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ను బట్టి వృష‌క‌ర్మ‌లో వేదాల ప్రాముఖ్యత, శక్తులను గొప్పగా చూపించారని తెలుస్తోంది. అలాగే ‘‘సృష్టి ధ‌ర్మాన్ని కాపాడ‌టం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృష‌క‌ర్మ‌వి నువ్వే’’ అనే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

రిలీజ్ డేట్

నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటించిన వృష‌క‌ర్మ‌ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జయరాం, స్పర్ష్ శ్రీవాత్సవ, సత్య తదితరులు కూడా నటించిన వృష‌క‌ర్మ‌ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Featured Video

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks