Web Series Actress: భోజ్‌పురి సినిమాలు, 10కి పైగా ప్రముఖ హిందీ వెబ్ సిరీస్‌లలో నటించిన ఒక వర్ధమాన నటి సెక్స్ రాకెట్ నడుపుతూ థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (AHTC) అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

సినిమాలు, ఓటీటీ షోలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక మహిళలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్.. పడ్వాల్ నగర్‌లో ట్రాప్
మహారాష్ట్రలోని థానే నగర పరిధిలో కొద్దిరోజులుగా రహస్యంగా ఒక హైప్రొఫైల్ వ్యభిచార రాకెట్ నడుస్తున్నట్లు ఏహెచ్‌టీసీ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజలి ఆంధలేకి ముందస్తు సమాచారం అందింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాగ్లే ఎస్టేట్‌లోని పడ్వాల్ నగర్ ఏరియాలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
సదరు నటి ఇద్దరు అమాయక యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇద్దరు అమాయక యువతుల రెస్క్యూ.. బీఎన్‌ఎస్ కింద ఎఫ్‌ఐఆర్
దాడి సమయంలో అక్కడ చిక్కుకున్న ఇద్దరు యువతులను పోలీసులు సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటిపై భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు అనైతిక వ్యాపార నిరోధక చట్టం (ITPA) నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అయితే కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటం వల్ల, నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల వివరాలు సేకరించేందుకు పోలీసులు సదరు నటి పేరును అధికారికంగా గోప్యంగా ఉంచారు.
గ్లామర్ వెనుక చీకటి సామ్రాజ్యం.. నెట్‌వర్క్ తీగ లాగుతున్న పోలీసులు
అరెస్ట్ అయిన నటికి భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అయిన 10కి పైగా పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఆమె కీలక పాత్రలు పోషించింది. అవకాశాలు తగ్గడం వల్లే ఈజీ మనీ కోసం ఇలాంటి అక్రమ దందాలకు దిగిందా లేదా దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
{{/usCountry}}అరెస్ట్ అయిన నటికి భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అయిన 10కి పైగా పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఆమె కీలక పాత్రలు పోషించింది. అవకాశాలు తగ్గడం వల్లే ఈజీ మనీ కోసం ఇలాంటి అక్రమ దందాలకు దిగిందా లేదా దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
{{/usCountry}}ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర ఏజెంట్లు, కస్టమర్ల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకి సంబంధించి మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.