టాలీవుడ్ స్టార్ నటీనటులు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల కిందట ఈ జంట అధికారికంగా తమ పెళ్లి ప్రకటన చేసి అభిమానులను ఎంతగానో సంతోషపెట్టారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 24) తమ పెళ్లికి ముందు జరుగుతున్న సరదా ఆటలు, వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పంచుకున్నారు.
విరోష్ ప్రీమియర్ లీగ్

రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న ఒక గ్రౌండ్ కి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ ఫన్ గేమ్స్ కోసం చాలా మంది బంధువులు, స్నేహితులు గుమిగూడి ఉన్నారు. అయితే ఆ ఫోటోలో వారి ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపించలేదు.
మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా ఇదే తరహాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న ఒక పాప్‌కార్న్ బకెట్ ఫోటోను పంచుకున్నాడు.
ఇలా తమ అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతున్న సరదా ఆటలకు సంబంధించిన చిన్న చిన్న గ్లింప్స్‌ను వారు అభిమానులతో పంచుకున్నారు. దీన్ని బట్టి ఈ జంట తమ పెళ్లి వేడుకను కేవలం తమకు ఇష్టమైన, అత్యంత ఆప్తుల మధ్య మాత్రమే ఎంతో ఏకాంతంగా జరుపుకుంటున్నారని స్పష్టమవుతోంది.
దీనికి ముందు విజయ్ ఒక పూల్‌సైడ్ దగ్గర జరిగిన ఒక సరదా గ్యాదరింగ్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో స్విమ్మింగ్ పూల్ లో కొందరు వాలీబాల్ ఆడటం చూడొచ్చు. అదే సమయంలో రష్మిక కూడా ఒక అందమైన డిన్నర్ సెటప్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.
విజయ్, రష్మిక ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనౌన్స్‌మెంట్
గత ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు రష్మిక, విజయ్ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఒక అందమైన నోట్ ద్వారా తమ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించిన విషయం తెలిసిందే. ఆ నోట్లో వారు ఇలా రాసుకొచ్చారు.
{{/usCountry}}గత ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు రష్మిక, విజయ్ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఒక అందమైన నోట్ ద్వారా తమ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించిన విషయం తెలిసిందే. ఆ నోట్లో వారు ఇలా రాసుకొచ్చారు.
{{/usCountry}}"మా ప్రియమైన వారికి.. మేము మా కోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకోకముందే, ఏదీ ఎంచుకోకముందే మీరు ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరే మాకు ఒక పేరు పెట్టారు. మమ్మల్ని 'విరోష్' (VIROSH) అని పిలిచారు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరే పెడుతున్నాము. మా పెళ్ళికి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పేరు పెట్టాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇంతలా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో ఒక భాగమే. బిగ్గెస్ట్ హగ్స్ అండ్ ఫుల్ లవ్" అని వారు ఆ ప్రకటనను ముగించారు.
గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల మధ్య రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం చాలా సైలెంట్‌గా జరిగింది. అక్టోబర్ 3న వారు ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వారు పెళ్లి పీటలెక్కనున్నారు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించినప్పటి నుంచే ఈ జంట ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి.