లవ్ బర్డ్స్‌కు ఏమైంది? టీమిండియా స్పిన్నర్ చాహల్, మహ్వాష్ రిలేషన్‌షిప్ బ్రేక్-ఇన్‌స్టాలో అన్‌ఫాలో!
కొంత కాలం క్రితం సోషల్ మీడియాలో, వార్తల్లో ఎక్కువగా వినిపించిన జోడీ పేరు చాహల్, మహ్వాష్. ఐపీఎల్ టైమ్ లో, ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ లవ్ బర్డ్స్ వైరల్ గా మారారు.అయితే ఇప్పుడు వీళ్ల రిలేషన్ షిప్ బ్రేక్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు వార్తల్లో నిలిచిన జోడీ ఆర్జే మహ్వాష్-యుజ్వేంద్ర చాహల్. టీమిండియా సీనియర్ స్పిన్నర్ చాహల్, మహ్వాష్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీళ్లు బయట కలిసి కనిపించడం, అప్పుడప్పుడు తమ కామెంట్లు, పోస్టుల ద్వారా హింట్లు ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు వీళ్ల బంధం ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే ఇందుకు కారణం.

చాహల్, మహ్వాష్ డేటింగ్
సోషల్ మీడియాలో ట్రోలింగ్, విపరీతమైన డేటింగ్ పుకార్ల కారణంగా నెలల తరబడి వార్తల్లో నిలిచిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, మహ్వాష్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి సంబంధంపై కొత్త ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. వీరిలో ఎవరూ ఈ తాజా పరిణామంపై స్పందించనప్పటికీ, వారి ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే వారు ఇకపై ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదని తెలుస్తోంది.
హాట్ టాపిక్ గా
చాహల్, మహ్వాష్ ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వారు ఒకరి ఫాలోయింగ్ లిస్ట్‌లో మరొకరు లేరని హైలైట్ చేసే స్క్రీన్‌షాట్లు కూడా ఉన్నాయి. రెడిట్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇది చర్చనీయాంశంగా మారింది.
'ఇది ఇన్‌స్టాలో అంతటా బయటపడింది. ఇద్దరూ అన్‌ఫాలో అయ్యారు' అని ఒక యూజర్ రాసుకొచ్చారు. 'ఇది కేవలం స్నేహమా?' అని మరొకరు పంచుకున్నారు. 'ఇన్‌స్టాగ్రామ్ డ్రామా అలర్ట్! యుజ్వేంద్ర చాహల్ & మహ్వాష్‌లు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. స్నేహం అధికారికంగా ముగిసిపోయిందా? కేవలం సాధారణ అన్‌ఫాలోనా? లేక తెరవెనుక పెద్ద ట్విస్ట్ ఉందా?' అని ఒకరు పోస్ట్ చేశారు.
ఏమైంది మరి?
యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్నాడు. అయితే అంతకంటే ముందే మహ్వాష్ తో అతనికి పరిచయం ఉంది. దీంతో చాహల్ విడాకులకు మహ్వాష్ కారణమనే ఆరోపణలు వచ్చాయి. వీటిని ఖండించిన మహ్వాష్, చాహల్ క్లోజ్ గానే మూవ్ అయ్యారు. వెకేషన్లకూ వెళ్లారు. ఒకరి బర్త్ డేను మరొకరు సెలబ్రేట్ చేశారు. మరి ఇప్పుడు సడెన్ గా ఏమైందనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
సీరియస్ గా తీసుకోరేమో
'యుజ్వేంద్ర చాహల్, మహ్వాష్‌ల మధ్య ఉన్న ఏదైనా సంబంధం ఇప్పుడు ముగిసిపోయినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది?' అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 'యుజి చాలా సరదాగా, ఫన్నీగా ఉంటాడు. కాబట్టి బహుశా ప్రజలు అతన్ని సీరియస్‌గా తీసుకోరు. మొదట ధనశ్రీ వర్మతో అతని విడిపోవడం, ఆ తర్వాత మహ్వాష్ తో. ఇది యుజికి కష్టమైన దశలా అనిపిస్తుంది’’ అని మరొకరు రాసుకొచ్చారు.
చాహల్, మహ్వాష్ గురించి..
చాహల్ 2020లో కొరియోగ్రాఫర్, రియాలిటీ షో స్టార్ అయిన ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. వారు 2024లో విడిపోయారు. గతేడాది విడాకులు తీసుకున్నారు. మరోవైపు ఆర్జే, మోడల్, నటి అయిన మహ్వాష్ బిజీగా గడుపుతోంది. చాహల్ విడాకుల తర్వాత మహ్వాష్ అతనికి ఇంకా క్లోజ్ అయిందనే టాక్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా మ్యాచ్ లకు, ఐపీఎల్ లో ఈ జంట కనిపించింది. ఐపీఎల్ లో చాహల్ కు మహ్వాష్ సపోర్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


