Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నుంచి స్టార్ హీరోయిన్ ఔట్.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ.. తెలుగులో ఫస్ట్
Illu Illalu Pillalu: తెలుగులో టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మేజర్ ఛేంజ్ చోటు చేసుకుంది. సీరియల్ లో ప్రధాన పాత్రల్లో ఒకటైన ప్రేమ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ మారిపోయింది. కొత్తగా మన్విత జగదీష్ అడుగుపెట్టింది. ఆమె గురించి పూర్తి వివరాలు చూసేయండి.
Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. రామరాజు కుటుంబం చుట్టూ ఈ సీరియల్ కథ సాగుతోంది. తాజాగా ఈ సీరియల్ ఓ ప్రధాన మార్పు చోటు చేసుకుంది. ప్రేమ క్యారెక్టర్ ప్లే చేస్తున్న హీరోయిన్ మారింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరోయిన్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కోడళ్ల పేర్లు శ్రీవల్లి, నర్మద, ప్రేమ. ఇందులో చిన్న కొడుకు ధీరజ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. సీరియల్ లో ఈ పాత్ర క్యారెక్టర్ చాలా చలాకీగా ఉంటుంది. ఇన్ని రోజులూ భర్త ప్రేమ పొందలేకపోయిన ప్రేమ.. ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకున్న భర్తకు దగ్గరవుతోంది.
లావణ్య భరద్వాజ్
ఇన్ని రోజులూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ పాత్రను లావణ్య భరద్వాజ్ పోషించింది. ఈమె కన్నడ నటి. చలాకీగా నటించడంతో పాటు ఎమోషన్ సీన్స్ లోనూ మంచి నటన కనబరిచింది. కానీ ఇప్పుడు ఆమె సీరియల్ నుంచి తప్పుకొంది. అయితే దీనికో ప్రధాన కారణం ఉంది. లావణ్య ఇప్పుడు ప్రెగ్నెంట్. అందుకే సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఎవరీ మన్విత?
సీరియల్స్ లో హీరోయిన్లు తప్పుకున్నంత మాత్రాన క్యారెక్టర్లు ఆగిపోవు కదా. అందుకే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ చేసే లావణ్య భరద్వాజ్ స్థానంలో ఇప్పుడు మన్విత జగదీష్ వచ్చింది. ఆమె కూడా కన్నడ భామనే. మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా పేరు తెచ్చుకున్న మన్వితకు తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో తెలుగులో అడుగుపెట్టింది.
ఎలా చేస్తుందో?
సీరియల్స్ లో నటులు మారిపోవడం కామనే. కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమగా లావణ్య భరద్వాజ్ తనదైన ముద్ర వేసింది. ఇంట్లో నుంచి వచ్చిపోయి పెళ్లి చేసుకున్న మేనత్తలాగే తాను కూడా అత్త కొడుకునే వివాహం చేసుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే ఫన్నీ, ఎమోషనల్ సీన్లను లావణ్య బాగా పండించింది.
ఇప్పటికిప్పుడు ప్రేమ క్యారెక్టర్లో లావణ్య స్థానంలో మన్వితను చూడటం ప్రేక్షకులకు కాస్త కష్టమే. కొత్తగా అనిపిస్తుంది. కానీ సీరియల్ సాగుతున్నా కొద్దీ అలవాటైపోతుందని చెప్పొచ్చు. తన ఫస్ట్ ఎపిసోడ్ లో బల్లి మీద పడిందని నానా హంగామా చేసిన ప్రేమలా మన్విత బాగానే నటించింది. మరి ముందు ముందు ఎలా చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


