Yami Gautam: లీగల్ డ్రామా ‘హక్’ (Haq) లో ముస్లిం మహిళ షాజియా బానోగా మెప్పించేందుకు నటి యామీ గౌతమ్ ఏకంగా నాలుగు నెలల పాటు ఖురాన్ పఠనం నేర్చుకున్నారట. దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన ‘షా బానో’ కేసు ఆధారంగా రూపొందిన ఈ మూవీ గురించి దర్శకుడు సుపర్ణ్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాలుగు నెలల కఠిన సాధన..

నటన పట్ల అత్యంత అంకితభావం కలిగిన నటీమణులలో యామీ గౌతమ్ ఒకరని మరోసారి నిరూపితమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘హక్’ (Haq) మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలై.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు సుపర్ణ్ వర్మ ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా వెనుక జరిగిన భారీ కసరత్తు గురించి వివరించారు.
ఈ సినిమాలో షాజియా బానో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు యామీ గౌతమ్ ఎంతగానో శ్రమించారు. “నేను యామీతో స్వయంగా ఖురాన్ చదవడం నేర్పించాను. ఆ పవిత్ర గ్రంథంలోని మాండలికం, అరబిక్ పదాల ఉచ్చారణను అర్థం చేసుకోవడానికి ఆమె ఏకంగా నాలుగు నెలల సమయాన్ని వెచ్చించింది” అని దర్శకుడు సుపర్ణ్ వర్మ ప్రశంసించారు.
కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాకుండా, ఆ పాత్రలోని సాంస్కృతిక, మతపరమైన లోతును ప్రతిబింబించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.
ఒకటిన్నర ఏళ్ల సుదీర్ఘ పరిశోధన..
దర్శకుడు సుపర్ణ్ వర్మ మాట్లాడుతూ కేవలం నటీనటులే కాకుండా చిత్ర బృందం మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పరిశోధన చేసినట్లు తెలిపారు.
“మేము ఇస్లామిక్ చట్టాన్ని, దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిపాము” అని ఆయన వెల్లడించారు.
{{/usCountry}}“మేము ఇస్లామిక్ చట్టాన్ని, దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిపాము” అని ఆయన వెల్లడించారు.
{{/usCountry}}ఈ కాలంలో సోషల్ మీడియాలో మతం గురించి తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రచారమవుతున్న తరుణంలో.. ‘హక్’ సినిమా ఒక హేతుబద్ధంగా నిలవాలని తాము ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు.
షా బానో కేసు స్ఫూర్తితో..
ఈ హక్ మూవీ 1985లో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు ‘మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం’ కేసు ఆధారంగా రూపొందింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఈ కేసు భారత న్యాయ చరిత్రలో ఒక మైలురాయి.
సినిమాలో యామీ గౌతమ్ తన హక్కుల కోసం భర్తతో న్యాయపోరాటం చేసే ధైర్యవంతురాలైన మహిళగా అద్భుతంగా నటించారు. ఇందులో ఆమె భర్తగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో మెరిశారు.
‘ఆర్టికల్ 370’ వంటి దేశభక్తి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న యామీ గౌతమ్.. ‘హక్’ మూవీతో తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. మహిళా హక్కులు, సామాజిక న్యాయం, చట్టపరమైన అంశాలను మేళవించిన ఈ చిత్రం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.