...
...
Next Story

ఆ దేశంలోనే సినిమాను బ్యాన్ చేయలేదు.. అందరూ చూడొచ్చని సెన్సార్ చెప్పింది.. ఏ మతానికి వ్యతిరేకం కాదు: యామీ గౌతమ్ కామెంట్స్

ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ నటించిన హక్ మూవీ వచ్చే వారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను యూఏఈలాంటి దేశం కూడా నిషేధించలేదని, ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేసింది.

Published on: Oct 31, 2025, 09:58:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓజీ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్లో నటించిన మూవీ 'హక్' (Haq). ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇస్లాంలో విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఈ సినిమాపై ఓ వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన యామీ గౌతమ్ స్పందించింది.

యూఏఈలో గ్రీన్ సిగ్నల్

ఆ దేశంలోనే సినిమాను బ్యాన్ చేయలేదు.. అందరూ చూడొచ్చని సెన్సార్ చెప్పింది.. ఏ మతానికి వ్యతిరేకం కాదు: యామీ గౌతమ్ కామెంట్స్
ఆ దేశంలోనే సినిమాను బ్యాన్ చేయలేదు.. అందరూ చూడొచ్చని సెన్సార్ చెప్పింది.. ఏ మతానికి వ్యతిరేకం కాదు: యామీ గౌతమ్ కామెంట్స్

హక్ మూవీ సెన్సార్ గురించి నటి యామీ గౌతమ్ టైమ్స్ నౌతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె యూఏఈ సెన్సార్ గురించి మొట్టమొదటిసారిగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

"ఈ సినిమాకి యూఏఈలో సెన్సార్‌పరంగా ఎటువంటి కట్స్ లేకుండా, '15 ప్లస్' సర్టిఫికేట్ లభించింది. అంటే ఇది అందరూ చూడదగిన సినిమా. అక్కడ ఎలాంటి సమస్య లేదంటే ఈ సినిమా ఏ మతాన్నీ విమర్శించడానికి తీయలేదని అర్థం" అని ఆమె నొక్కి చెప్పింది.

"సినిమా విడుదల కాకుండా దీనికి మించి సాక్ష్యం ఇవ్వడం కష్టమే. మేము ఒక్క వర్గానికి మాత్రమే సంబంధించి సినిమా తీయడం లేదు" అని యామీ గౌతమ్ స్పష్టం చేసింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కోర్టు డ్రామాను 1985 నాటి చారిత్రక షా బానో బేగం కేసు స్ఫూర్తితో రూపొందించారు.

'హక్' మూవీ స్టోరీ ఇలా..

ఇది జిగ్నా వోరా రాసిన 'బానో: భారత్ కీ బేటీ' అనే పుస్తకంలోని అంశాల ఆధారంగా తెరకెక్కింది. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం అనే చారిత్రక కేసుకు సంబంధించిన సంఘటనలను ఈ సినిమా నాటకీయంగా చూపించనుంది.

ఇప్పుడా కేసు ఆధారంగానే ఈ హక్ మూవీ వస్తోంది. ఈ 'హక్' సినిమాలో యామీ గౌతమ్‌తో పాటు ఇమ్రాన్ హష్మి, షీబా చద్దా, వర్తికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. షాజియా బానో పాత్రో యామీ, ఆమె భర్త అబ్బాస్ ఖాన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. ఓ ముస్లిం అయిన ఇమ్రాన్ కూడా ఈ సినిమా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా తీసింది కదాని స్పష్టం చేశాడు.

ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. జంగ్లీ పిక్చర్స్, ఇన్‌సోమ్నియా ఫిల్మ్స్, బావేజా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks