Yash Ramayana: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు రాకింగ్ స్టార్ యశ్ గట్టిగా స్పందించారు. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల భారీ చిత్రంలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన రామాయణ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. సినిమాపై జరుగుతున్న చర్చలు, ముఖ్యంగా 4000 కోట్ల భారీ బడ్జెట్ గురించి వస్తున్న ట్రోల్స్కు పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. విదేశీ మార్కెట్లో మన సినిమాల స్థాయిని చాటి చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడి గురించి గర్వంగా మాట్లాడాలని ఆయన తేల్చిచెప్పారు.
చిన్న బడ్జెట్ అని చెబితే విదేశాల్లో పట్టించుకోరు
చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు 4000 కోట్లుగా ఉంటుందని వెల్లడించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై యశ్ స్పందిస్తూ.. "నమిత్ ఈ భారీ ఫిగర్ గురించి మాట్లాడినప్పటి నుంచి జనాలు ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. మన దేశంలో ఇదే పెద్ద సమస్య. విదేశాలకు వెళ్లి మన సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు, ఇది తక్కువ బడ్జెట్ సినిమా అని చెబితే వారు దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. మనం ఎంత పెట్టుబడి పెట్టామో, మన దేశం ఏం చేయగలదో ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పాలి" అని అన్నారు.
అంతేకాకుండా ఈ 4000 కోట్ల బడ్జెట్ కేవలం మొదటి సినిమాకు మాత్రమే కాదని, రెండు భాగాలకు సంబంధించిన ప్రొడక్షన్, ప్రమోషన్స్, గ్లోబల్ రిలీజ్ ఖర్చులు అన్నీ కలిపి అని ఆయన స్పష్టతనిచ్చారు.
బ్రిటీషర్ల తరహాలో విడగొట్టకండి
{{/usCountry}}అంతేకాకుండా ఈ 4000 కోట్ల బడ్జెట్ కేవలం మొదటి సినిమాకు మాత్రమే కాదని, రెండు భాగాలకు సంబంధించిన ప్రొడక్షన్, ప్రమోషన్స్, గ్లోబల్ రిలీజ్ ఖర్చులు అన్నీ కలిపి అని ఆయన స్పష్టతనిచ్చారు.
బ్రిటీషర్ల తరహాలో విడగొట్టకండి
{{/usCountry}}ఇదే వేదికపై నెటిజన్లను ఉద్దేశించి యశ్ మాట్లాడుతూ.. "ఎవరైనా మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తారు. కానీ మీరు కూడా బ్రిటీషర్లలాగా విడగొట్టి పాలించే విధానాన్ని ఫాలో కావద్దని నేను కోరుతున్నాను. ఈ సినిమాను సక్సెస్ చేయడానికి అందరం కలిసి రావాలి. ముఖ్యంగా కర్ణాటక ప్రజలు కుటుంబ సమేతంగా థియేటర్లలో ఈ దృశ్యకావ్యాన్ని చూడాలని మనసారా కోరుకుంటున్నాను" అని పిలుపునిచ్చారు.
రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2026 నవంబర్ 5న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు ట్రైలర్లు రిలీజ్ కాగా.. రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ విజువల్ వండర్ భారీ స్కేల్, బీజీఎం, రావణుడిగా యశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి ఈ మధ్యే టాక్సిక్ తో దారుణంగా బోల్తా పడిన యశ్.. ఈ రామాయణంతో ఏం చేస్తాడో చూడాలి.