Yash Mother: నా కొడుకు టెర్రరిస్ట్ కాదు-ఎందుకు భయపడుతున్నారు- యశ్ తల్లి సంచలన వ్యాఖ్యలు-అల్లు అరవింద్ కు కౌంటర్?
Yash Mother: టాక్సిక్ మూవీతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. తాజాగా అతని తల్లి పుష్ప అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు టెర్రరిస్ట్ కాదని, ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అయితే గతంలో అల్లు అరవింద్ కామెంట్లకు ఆమె ఇలా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.
Yash Mother: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా సంచలన చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గతంలో యశ్‌ను ఉద్దేశించి చేసిన పాత కామెంట్లు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారాయి. "కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎవరు?" అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు.

అల్లు అరవింద్ పాత వ్యాఖ్యలు
గతంలో 'కేజీఎఫ్' సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడిదే అన్న కోణంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. "ఆ సినిమా రాకముందు యశ్ ఎవరు?" అనే వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలో రన్ అవుతున్న వేళ ఈ ఇష్యూ మళ్లీ తెరపైకి రావడంతో యశ్ తల్లి పుష్ప ఒక ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ పేరు ఎత్తకుండానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
యశ్ తల్లి ఏమన్నారంటే?
"కేజీఎఫ్ కంటే ముందు కూడా యశ్ వరుసగా ఐదు హిట్లు కొట్టాడు. మీరు అంటున్నట్లు అతనేదో సాధారణ వ్యక్తి, అసలు గుర్తింపే లేని వాడైతే.. మరి అతనిని చూసి మీరెందుకు భయపడుతున్నారు? అతనేమీ టెర్రరిస్ట్ కాదు కదా. కేజీఎఫ్ కంటే ముందు అతను ఎవరో అడగాల్సిన అవసరమే లేదు.
అంతకు ముందే అతను ఎన్నో మంచి సినిమాలు చేశాడు. అంతేకాదు, ఇంకొందరిలాగా అతను కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో ఏమీ పుట్టలేదు. ఒక బస్సు డ్రైవర్ కొడుకుగా పుట్టి, తన కష్టంతో స్వయంగా పైకి ఎదిగాడు. ఒక తల్లిగా అతనిని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను" అని యశ్ తల్లి పుష్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
యశ్ రియాక్షన్
అల్లు అరవింద్ చేసిన ఈ "Who was Yash before KGF?" వ్యాఖ్యలపై గతంలో ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో యశ్ చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.
"ఒక సినిమా విజయం అనేది కేవలం ప్రొడ్యూసర్ లేదా కేవలం హీరో వల్ల సాధ్యం కాదు. సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుంది. క్రెడిట్ మొత్తం హీరోకే రావడం కామన్. కానీ, దర్శకుడు సృష్టించిన ఆ పాత్రను హీరో తన భుజాలపై మోయలేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. ప్రేక్షకులకు అన్నీ తెలుసు, ఏది బాగుంటే దాన్నే ఆదరిస్తారు" అంటూ చాలా హుందాగా సమాధానమిచ్చారు.
రూ.200 కోట్లు దాటిన ‘టాక్సిక్’
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్, నయనతార, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘టాక్సిక్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమాలో వయొలెన్స్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ.. మాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


