...
...
Next Story

Toxic Review: టాక్సిక్ రివ్యూ.. చిన్న కథ.. 194 నిమిషాల సినిమా.. బోల్డ్ అండ్ వైలెన్స్ మూవీ.. యశ్ హిట్ కొట్టాడా?

Toxic Review: కేజీఎఫ్ 2 తర్వాత నాలుగేళ్లకు రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన మూవీ ‘టాక్సిక్’. టీజర్, ట్రైలర్ తో హైప్ పెంచిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లకు వచ్చింది. మరి 194 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందో లేదో రివ్యూలో చూసేయండి.

Published on: Aug 26, 2026, 12:47:47 IST
Advertisement

Toxic Review:

టాక్సిక్ రివ్యూ.. చిన్న కథ.. 194 నిమిషాల సినిమా.. బోల్డ్ అండ్ వైలెన్స్ మూవీ.. యశ్ హిట్ కొట్టాడా? (x/KvnProductions)
టాక్సిక్ రివ్యూ.. చిన్న కథ.. 194 నిమిషాల సినిమా.. బోల్డ్ అండ్ వైలెన్స్ మూవీ.. యశ్ హిట్ కొట్టాడా? (x/KvnProductions)

మూవీ : టాక్సిక్ (Toxic: A Fairy Tale for Grown-ups)

రిలీజ్ డేట్: ఆగస్టు 26, 2026

నటీనటులు: యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, సుదేవ్ నాయర్ తదితరులు

దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్

నిర్మాతలు: వెంకట్ కె. నారాయణ, యశ్

సంగీతం: రవి బస్రూర్, విశాల్ మిశ్రా తదితరులు

కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ అంటూ బోల్డ్ అండ్ వైలెన్స్ మూవీతో థియేటర్లకు వచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది? మితిమీరిన శృంగారం, హింస సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించిందో టాక్సిక్ రివ్యూలో చూసేయండి.

స్టోరీ ఏంటంటే?

1947 నాటి గోవా నేపథ్యంలో టాక్సిక్ సినిమా కథ సాగుతుంది. సాల్వడార్ అనే గ్యాంగ్‌స్టర్ వద్ద పనిచేసే రాయా (యశ్), అతడి సోదరి గంగా (నయనతార) గోవాలోని అక్రమ వ్యాపారాలను శాసిస్తుంటారు. ఈ క్రమంలో సాల్వడార్ తన కుమార్తె రెబెక్కా (తారా సుతారియా)ను రాయాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే, సర్కస్ కళాకారిణి నాదియా (కియారా అద్వానీ)తో రాయా ప్రేమలో పడతాడు.

ఓ చిన్న కథను 194 నిమిషాలు సాగదీయడం.. టాక్సిక్ సినిమా గురించి సింపుల్ గా ఇలా చెప్పొచ్చు. సర్కస్ టెంట్ లో ప్రారంభమయ్యే తొలి సీన్ లోనే చిన్నారి 'టికెట్'ను (జోకర్ మేకప్‌తో ఉన్న బాలుడు) అతడి తల్లి నాదియా తన మాజీ భర్త రాయాకు అప్పగిస్తుంది. మొదటి సన్నివేశంలోనే పాత్రల మధ్య ఉన్న తీవ్రమైన ఆక్రోశం, ఆల్కహాల్ సీన్లు ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తిని, ఉత్కంఠనూ కలిగిస్తాయి.

అయితే ఆ తర్వాత గోవా డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న దశాబ్దాల నాటి కథను వేగంగా చూపించారు. రాయా తండ్రి, పోర్చుగీస్ గ్యాంగ్‌స్టర్లు, రాయా, అతడి సోదరి గంగా మధ్య సాగే కుట్రల చుట్టూ కథనం తిరుగుతుంది. అయితే ఓపెనింగ్, క్లైమాక్స్ మినహా మధ్యలో 3 గంటల పాటు కథను సాగతీయడం టాక్సిక్ ను దెబ్బతీసింది.

ప్లస్ పాయింట్లు

  • యష్ యాక్టింగ్: టాక్సిక్ సినిమాను తన భుజాలపై మోశాడు యష్. రాయా పాత్రలో ఊరమాస్ స్వాగ్, గంభీరమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆయన క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ‘రాయా’గా, అతడిపై పగ తీర్చుకోవాలనుకునే కొడుకు రుమీ అలియాస్ 'టికెట్'గా డ్యుయల్ రోల్ లో అదరగొట్టాడు.
  • కియారా అద్వానీ పర్ఫార్మెన్స్: ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, కియారా అద్వానీకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. మాటల కంటే కళ్లతోనే ఎమోషన్స్ పండించింది. యష్‌తో సాగే ఎమోషనల్ సీన్లను నిలబెట్టింది.
  • రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్: సినిమాకు ప్రధాన బలం విజువల్స్ అని చెప్పొచ్చు. 1920ల కాలం నుంచి 1947 భారత స్వాతంత్య్ర పోరాట సమయం, ఆ తర్వాత దశాబ్దాల కాల నేపథ్యాన్ని కథలో ఎంతో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ఒకప్పటి పోర్చుగీస్ నౌకాశ్రయమైన గోవాను డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మార్చి చూపిస్తూ.. 1920ల నాటి అమెరికన్ చికాగో నగరాన్ని తలపించేలా సెట్లు, సూట్లు, హెడ్ క్యాప్‌లు, టామీ గన్స్, లగ్జరీ క్లబ్‌లతో రూపొందించారు.

మైనస్ పాయింట్లు

  • 194 నిమిషాల రన్‌టైమ్: సినిమాకు అతిపెద్ద శాపం 3 గంటల 14 నిమిషాల రన్‌టైమ్. కథలో పెద్దగా స్పార్క్ లేకపోయినా సీన్లను విపరీతంగా సాగదీసి ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టారు.
  • శ్రుతిమించిన హింస: కథకు అవసరం లేకపోయినా మితిమీరిన హింస, విపరీతమైన ఇంటిమేట్, బోల్డ్ సీన్లు, నీతి బోధలతో నింపేశారు. దీంతో గీతూ మోహన్‌దాస్ చెప్పాలనుకున్న అసలు కథ ఆడియన్స్‌కు కనెక్ట్ కాకుండాపోయింది.
  • లౌడ్ బిజీఎమ్: రవి బస్రూర్ అందించిన బీజీఎం కొన్ని చోట్ల చెవులు చిల్లులు పడేలా ఉంది. డైలాగులను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డెసిబెల్స్ ముంచెత్తేశాయి.
  • ఇంతమంది ఉన్నా: నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి పవర్‌హౌస్ ఆర్టిస్టులను పెట్టుకుని వారికి సరైన పాత్రలు రాయకపోవడం స్క్రిప్ట్ లోపానికి నిదర్శనం.
  • తండ్రీకొడుకుల ఎమోషన్: యష్ రెండు పాత్రల (రాయా వర్సెస్ టికెట్) మధ్య ఎమోషనల్ డెప్త్ లోపించింది.

ఫైనల్ గా

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఒక పెద్ద క్యాన్వాస్‌పై ఈ సినిమాను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆమె ఆలోచనలు, ఆశయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మేకింగ్‌పై మరింత పట్టు అవసరం. అవసరానికి మించిన హింస, కథకు సంబంధం లేని సన్నివేశాలు సినిమా వేగాన్ని దెబ్బతీశాయి.

మొత్తంగా చెప్పాలంటే.. 'టాక్సిక్' సినిమా పెద్దవాళ్లకు చెప్పే ఓ మంచి కథలా నిలవలేకపోయింది. చాలా చిన్న కథను 194 నిమిషాల పాటు సాగదీయడం అతి పెద్ద లోపం. యశ్ అభిమానులకు, విపరీతమైన యాక్షన్ ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగ్గ చిత్రంగా అనిపించవచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe