...
...
Next Story

యోగా ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసిన మారుతి.. మణిశర్మ సంగీతం.. ఏ మతం లేదంటూ ది రాజా సాబ్ డైరెక్టర్ కామెంట్స్

ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా యోగా ఆంథెమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్‌ను ఇవాళ (జూన్ 21) ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 21, 2025, 19:11:13 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

"యోగాకు ప్రచారం కల్పిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది.యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులు అందరికీ ధన్యవాదాలు" అని పాటల రచయిత అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

యోగా ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసిన మారుతి.. మణిశర్మ సంగీతం.. ఏ మతం లేదంటూ ది రాజా సాబ్ డైరెక్టర్ కామెంట్స్
యోగా ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసిన మారుతి.. మణిశర్మ సంగీతం.. ఏ మతం లేదంటూ ది రాజా సాబ్ డైరెక్టర్ కామెంట్స్

మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

యోగా గొప్పదనం గురించి

ఈ కార్యక్రమంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యోగా గొప్పదనం గురించి వివరించారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. "యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత కావాలి. యోగా ఆంథెమ్ సాంగ్‌ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖలో ఆయన యోగా డే సెలబ్రేషన్స్‌కు హాజరవుతున్నారు" అని తెలిపారు.

ఇషాన్ క్రియేషన్స్ అశోక్

"ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీలో జరుగుతున్న యోగాంధ్ర సెలబ్రేషన్స్‌లో ఈ యోగా ఆంథెమ్ ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవడం సంతోషకరం. ఈ పాట ద్వారా ఇషాన్ క్రియేషన్స్ అశోక్ గారు మోదీ గారిని కలిసే అవకాశం దక్కించుకున్నారు" అని మారుతి చెప్పారు.

"అశోక్ డిస్ట్రిబ్యూటర్‌గా నాకు తెలుసు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్‌లో నష్టాలు వచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టి మంచి పొజిషన్‌కు వచ్చారు. అలాగే అన్ని శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు తిరిగి, యోగా గురించి తెలుసుకుని, యోగాకు ప్రచారం చేస్తున్నారు. వారు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. "మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అలా మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా" అని అన్నారు.

సంస్కృత పదాలు ఉపయోగించి

"ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు ఉపయోగించి రాశాను. సంస్కృతాన్ని దైవ భాష అని అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో పాట రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు థ్యాంక్స్" అని అనంత శ్రీరామ్ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks