Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. ఆరేళ్ల కిందట యూట్యూబ్ లో రిలీజై సంచలన విజయం సాధించిన దిండోరా వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఇప్పటికే తొలి సీజన్ ను కూడా ఈ ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
టీటూ మామ వచ్చేస్తున్నాడు

దిండోరా వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో లాటరీ టికెట్ చుట్టూ తిరిగిన కథ, సీజన్ 2కి వచ్చేసరికి మరింత రసవత్తరంగా, భారీ ఎత్తున మారనుంది. ఈ కొత్త సీజన్‌లో అందరి అభిమాన పాత్ర అయిన టీటూ మామా ఏకంగా రూ. 11 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకోవడంతో పాటు తన అత్తవారింటి కుటుంబంతో ఊహించని వివాదాల్లో చిక్కుకుంటారు.
టీటూ మామా పాత్ర అంటేనే అవుట్ అండ్ అవుట్ కామెడీ రచ్చ, పదునైన డైలాగులు. అలాంటిది ఏకంగా రూ. 11 కోట్ల నష్టం, దానికి తోడు అత్తవారింటి గొడవలు తోడైతే ఎలాంటి రోలర్‌కోస్టర్ నవ్వుల రైడ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భువన్ బామ్ తన డిజిటల్ ప్రపంచంలోని దాదాపు 10 విభిన్న పాత్రల్లో మెరిసి ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడంటే?
ఈ మోస్ట్ అవేటెడ్ కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను నిర్మాతలు అధికారికంగా ఖరారు చేశారు. నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘దిండోరా 2’ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. రోహిత్ రాజ్, భువన్ బామ్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
యూట్యూబ్ రికార్డుల నుంచి గ్లోబల్ ఓటీటీ దాకా..
సీజన్ 1 యూట్యూబ్‌లో విడుదలై దాదాపు 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి భారతీయ డిజిటల్ రంగంలో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఒక ఇండిపెండెంట్ క్రియేటర్ స్వతంత్రంగా రూపొందించిన సిరీస్ ఇంతటి ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు సీజన్ 2ను గ్లోబల్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సైతం భారీ స్థాయిలో నిర్మించి స్ట్రీమింగ్ చేస్తోంది.
భువన్ బామ్ ఏమన్నాడంటే?
{{/usCountry}}సీజన్ 1 యూట్యూబ్‌లో విడుదలై దాదాపు 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి భారతీయ డిజిటల్ రంగంలో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఒక ఇండిపెండెంట్ క్రియేటర్ స్వతంత్రంగా రూపొందించిన సిరీస్ ఇంతటి ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు సీజన్ 2ను గ్లోబల్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సైతం భారీ స్థాయిలో నిర్మించి స్ట్రీమింగ్ చేస్తోంది.
భువన్ బామ్ ఏమన్నాడంటే?
{{/usCountry}}“దిండోరా ప్రపంచం అనేది మన రోజువారీ జీవితాల్లో చూసే రిలేటబుల్ హ్యూమర్‌తో ప్రారంభమైంది. సీజన్ 2ని నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌పై మరింత పెద్ద కాన్వాస్‌లో అందించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన ఎమోషన్స్, కామెడీ ఫ్లేవర్ దెబ్బతినకుండానే గ్లోబల్ ఆడియెన్స్ కు ఈ కథను చేరువ చేస్తున్నాం” అని భువన్ బామ్ అన్నాడు.
మధ్య తరగతి కుటుంబ కథాంశం, అసలైన కామెడీ సన్నివేశాలు, టీటూ మామా అల్లరితో రాబోతున్న ‘దిండోరా 2’ నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరించనుంది. బీబీ కీ వైన్స్ అభిమానులతో పాటు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీకెండ్ అద్భుతమైన వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ తొలి సీజన్ చూడకపోతే వెంటనే యూట్యూబ్ లేదంటే నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి.