Comedy Web Series: యూట్యూబ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

Comedy Web Series: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘బీబీ కీ వైన్స్’ (BB Ki Vines) అధినేత, ప్రముఖ క్రియేటర్-నటుడు భువన్ బామ్ మళ్లీ తన క్రేజీ క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సృష్టించి, స్వయంగా నటించిన వెబ్ సిరీస్ ‘దిండోరా’ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published on: Nov 4, 2026, 21:47:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. ఆరేళ్ల కిందట యూట్యూబ్ లో రిలీజై సంచలన విజయం సాధించిన దిండోరా వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఇప్పటికే తొలి సీజన్ ను కూడా ఈ ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Comedy Web Series: యూట్యూబ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
Comedy Web Series: యూట్యూబ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

టీటూ మామ వచ్చేస్తున్నాడు

దిండోరా వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో లాటరీ టికెట్ చుట్టూ తిరిగిన కథ, సీజన్ 2కి వచ్చేసరికి మరింత రసవత్తరంగా, భారీ ఎత్తున మారనుంది. ఈ కొత్త సీజన్‌లో అందరి అభిమాన పాత్ర అయిన టీటూ మామా ఏకంగా రూ. 11 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకోవడంతో పాటు తన అత్తవారింటి కుటుంబంతో ఊహించని వివాదాల్లో చిక్కుకుంటారు.

టీటూ మామా పాత్ర అంటేనే అవుట్ అండ్ అవుట్ కామెడీ రచ్చ, పదునైన డైలాగులు. అలాంటిది ఏకంగా రూ. 11 కోట్ల నష్టం, దానికి తోడు అత్తవారింటి గొడవలు తోడైతే ఎలాంటి రోలర్‌కోస్టర్ నవ్వుల రైడ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భువన్ బామ్ తన డిజిటల్ ప్రపంచంలోని దాదాపు 10 విభిన్న పాత్రల్లో మెరిసి ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడంటే?

ఈ మోస్ట్ అవేటెడ్ కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను నిర్మాతలు అధికారికంగా ఖరారు చేశారు. నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘దిండోరా 2’ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. రోహిత్ రాజ్, భువన్ బామ్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

యూట్యూబ్ రికార్డుల నుంచి గ్లోబల్ ఓటీటీ దాకా..

సీజన్ 1 యూట్యూబ్‌లో విడుదలై దాదాపు 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి భారతీయ డిజిటల్ రంగంలో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఒక ఇండిపెండెంట్ క్రియేటర్ స్వతంత్రంగా రూపొందించిన సిరీస్ ఇంతటి ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు సీజన్ 2ను గ్లోబల్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సైతం భారీ స్థాయిలో నిర్మించి స్ట్రీమింగ్ చేస్తోంది.

భువన్ బామ్ ఏమన్నాడంటే?

“దిండోరా ప్రపంచం అనేది మన రోజువారీ జీవితాల్లో చూసే రిలేటబుల్ హ్యూమర్‌తో ప్రారంభమైంది. సీజన్ 2ని నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌పై మరింత పెద్ద కాన్వాస్‌లో అందించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన ఎమోషన్స్, కామెడీ ఫ్లేవర్ దెబ్బతినకుండానే గ్లోబల్ ఆడియెన్స్ కు ఈ కథను చేరువ చేస్తున్నాం” అని భువన్ బామ్ అన్నాడు.

మధ్య తరగతి కుటుంబ కథాంశం, అసలైన కామెడీ సన్నివేశాలు, టీటూ మామా అల్లరితో రాబోతున్న ‘దిండోరా 2’ నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరించనుంది. బీబీ కీ వైన్స్ అభిమానులతో పాటు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీకెండ్ అద్భుతమైన వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ తొలి సీజన్ చూడకపోతే వెంటనే యూట్యూబ్ లేదంటే నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More