...
...
Next Story

Youtube Star: యూట్యూబ్ సంపాదనతోనే రూ.50 కోట్ల బంగ్లా.. నవ్వుతూనే కోట్లు.. సినిమా హీరోయిన్లు కూడా సాటిరారు

Youtube Star: సినిమాల్లో మూడు దశాబ్దాలుగా ఉన్నా కూడా సంపాదించని సొమ్మును కేవలం రెండేళ్లలోనే యూట్యూబ్ లో సంపాదించింది నటి అర్చనా పూరన్ సింగ్. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతోంది.

Published on: Oct 5, 2026, 11:50:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Youtube Star: బాలీవుడ్ సీనియర్ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చనా పూరన్ సింగ్ (Archana Puran Singh) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా సినిమాల్లో, బుల్లితెరపై మెరిసిన ఈమె.. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం రెండేళ్ల క్రితం సరదాగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ వ్లాగింగ్ ద్వారా ఏకంగా రూ.50 కోట్ల విలువైన కొత్త బంగ్లాను కొనుగోలు చేసి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు.

మడ్ ఐలాండ్‌లో రూ.50 కోట్ల రాయల్ బంగ్లా

Youtube Star: యూట్యూబ్ సంపాదనతోనే రూ.50 కోట్ల బంగ్లా.. నవ్వుతూనే కోట్లు.. సినిమా హీరోయిన్లు కూడా సాటిరారు
Youtube Star: యూట్యూబ్ సంపాదనతోనే రూ.50 కోట్ల బంగ్లా.. నవ్వుతూనే కోట్లు.. సినిమా హీరోయిన్లు కూడా సాటిరారు

ముంబైలోని పాష్ ఏరియా మడ్ ఐలాండ్‌లో అర్చనా పూరన్ సింగ్, ఆమె భర్త పర్మీత్ సేతి కలసి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. రెండు అంతస్తుల్లో విశాలమైన లివింగ్ రూమ్, మోడర్న్ కిచెన్, లగ్జరీ బెడ్‌రూమ్‌లతో కూడిన గార్డెన్ ఏరియాతో ఈ సీ-ఫేసింగ్ బంగ్లా ఒక ప్రైవేట్ వెకేషన్ రిసార్ట్‌ను తలపిస్తోంది.

ఈ కొత్త ఇంట్లోనే తమ ఫ్యూచర్ యూట్యూబ్ వీడియోల షూటింగ్స్, కుకింగ్ వ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ ఫ్యామిలీ రీసెంట్ వ్లాగ్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఉన్న పాత ఇంటికి కాస్త దూరంలోనే ఈ కొత్త బంగ్లా ఉండటం విశేషం.

టీవీ, సినిమాల కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదన

యూట్యూబ్ వల్ల వస్తున్న ఇన్ కమ్ చూసి అర్చనా ఫ్యామిలీ మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీనే ఆశ్చర్యపోతోంది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్చనా భర్త, యాక్టర్ పర్మీత్ సేతి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

తమ ముప్పై ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌లో వచ్చిన పారితోషికం కంటే యూట్యూబ్ డిజిటల్ కంటెంట్ ద్వారా దాదాపు మూడు రెట్లు ఎక్కువ డిజిటల్ రెవెన్యూ వస్తోందని ఆయన ఓపెన్‌‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. సినిమా అవకాశాల కోసం వెయిట్ చేసే కంటే సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయడమే నయమని నిరూపించారు.

ఫ్యామిలీ వ్లాగింగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్

ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే క్యాజువల్ సంభాషణలు, హ్యూమర్ నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. విపరీతమైన వ్యూయర్‌షిప్ కారణంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, యాడ్ రెవెన్యూ రూపంలో భారీగా ఆదాయం వచ్చి పడుతోంది.

రూ.75 కోట్ల పాత బంగ్లా.. పక్కనే మరొకటి

మడ్ ఐలాండ్‌లోనే అర్చనా పూరన్ సింగ్ కుటుంబానికి ఇప్పటికే రూ.75 కోట్ల విలువైన భారీ విల్లా ఉంది. ఇప్పుడు కొనుగోలు చేసిన రూ.50 కోట్ల బంగ్లా సరిగ్గా దాని పక్కనే ఉండటం గమనార్హం.

ఒక ఇంట్లో ఫ్యామిలీ నివాసం ఉంటూ, రెండో బంగ్లాను పూర్తిగా యూట్యూబ్ షూటింగ్స్, యోగా క్లాసెస్, డిజిటల్ కంటెంట్ వర్క్‌స్పేస్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ మాదిరిగా దీన్ని వాడుకోనున్నారు.

30 ఏళ్ల కెరీర్.. రీ-ఎంట్రీతో సరికొత్త మైలురాయి

'కుచ్ కుచ్ హోతా హై', 'మొహబ్బతే', 'రాజా హిందూస్తానీ' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో అర్చనా పూరన్ సింగ్ హిందీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత 'కామెడీ సర్కస్', 'ది కపిల్ శర్మ షో' లలో జడ్జిగా రీ-ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై చెరగని స్థానం సంపాదించుకున్నారు.

అయితే 30 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ ఇచ్చిన పాపులారిటీకి తోడు, ఈ రెండేళ్ల డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ఆమెకు ఊహించని రేంజ్ ఆర్థిక విజయాన్ని కట్టబెట్టింది. "మూడు పదుల సినిమా కెరీర్ ఇవ్వని ఆర్థిక విజయాన్ని కేవలం రెండేళ్ల యూట్యూబ్ వ్లాగింగ్ ఇచ్చిందా!" అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks