Shanmukh Jaswanth Wedding: అరె.. ఏంట్రా ఇది.. కూల్ గా పెళ్లి చేసేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

Shanmukh Jaswanth Wedding: అరె.. ఏంట్రా ఇది.. ఈ ఒక్క డైలాగ్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్న నటుడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ సిరీస్ లు, బిగ్ బాస్, వీడియో సాంగ్స్ తో షన్నూగా అతను అందరికీ పరిచయమే. ఈ షన్నూ ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా కూల్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Published on: Jun 22, 2026, 13:45:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shanmukh Jaswanth Wedding: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి లేకుండా షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి జరిగింది.

కూల్ గా పెళ్లి చేసేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కూల్ గా పెళ్లి చేసేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి

యూట్యూబ్ సిరీస్ లు, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి చేసుకున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వైష్ణవి చోడిశెట్టిని షణ్ముఖ్ వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు షణ్ముఖ్ తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు.

కూల్ గా వెడ్డింగ్

ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి పెళ్లి జరిగిపోయింది. వీళ్ల పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పుడు షన్నూ, వైష్ణవి వెడ్డింగ్ వీడియోలు వైరల్ గా మారాయి.

వెబ్ సిరీస్ లతో

షణ్ముఖ్ జస్వంత్ గురించి చాలా మందికి తెలిసిందే. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వీడియో సాంగ్స్ తో అతను కెరీర్ స్టార్ట్ చేశాడు. 'సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'సూర్య' వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు అతనికి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

బిగ్‌బాస్ రన్నరప్

ఇక షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ లో ముఖ్యంగా బిగ్ బాస్ గురించి చెప్పుకోవాలి. అతను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఈ షోతో లాభంతో పాటు అతనికి నష్టం కూడా జరిగిందనే టాక్ ఉంది. ఈ షో తర్వాత అతను, దీప్తి సునైనతో తమ రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డు వేశారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

ప్రేమకు నమస్కారం

యూట్యూబ్, ఓటీటీల్లో అలరించిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి రాబోతున్నాడు. అతను హీరోగా ‘ప్రేమకు నమస్కారం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బ్రహ్మాజీ, శివాజీ లాంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. ఇది త్వరలోనే థియేటర్లకు రాబోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More