గర్భవతిగా ఉన్నప్పుడే నా భార్య మోసం చేసింది, నా కొడుకును చూసేందుకు 37 లక్షలు ఇచ్చాను.. యూట్యూబర్ అనురాగ్ కన్నీళ్లు
YouTuber Anurag Dobhal Accuses Wife Ritika: ప్రముఖ యూట్యూబర్ 'UK07 రైడర్' అలియాస్ అనురాగ్ దొభాల్ తన భార్య రితికా చౌహాన్ గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమె క్లోజ్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, రూ. 37 లక్షలు ఇచ్చినా కూడా కొడుకును చూడనివ్వడం లేదని కొత్త వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
YouTuber Anurag Dobhal Accuses Wife Ritika: యూట్యూబ్ ప్రపంచంలో 'UK07 రైడర్'గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ వ్లాగర్, యూట్యూబర్ అనురాగ్ దొభాల్ కుటుంబ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. తన సొంత కుటుంబం మానసికంగా వేధిస్తోందని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన అనురాగ్, ఇప్పుడు నేరుగా తన భార్య రితికా చౌహాన్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు.

గర్భవతిగా ఉన్నప్పుడే నమ్మకద్రోహం!
తన గర్భధారణ సమయంలోనే భార్య రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి నమ్మకద్రోహం చేసిందని ఓ సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు అనురాగ్ దోభాల్. అనురాగ్ తన కొత్త వీడియోలో 'అన్నాథ్' (Annath) అనే పాటను విడుదల చేస్తూ, అది తన జీవిత నిజ కథ అని చెప్పారు. రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఉన్న దృశ్యాలను, చాటింగ్ స్క్రీన్‌షాట్లను ఆయన బయటపెట్టారు.
ఆ అబ్బాయి ఇంట్లో 15 రోజులు
"ఆమె నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది. గర్భవతిగా ఉన్న సమయంలోనే తన సోదరులు ఎరిక్, రోహిత్‌లతో కలిసి ఆ అబ్బాయి ఇంట్లో 15 రోజులు ఉంది. వాళ్ల అమ్మ కూడా ఆమెను నా నుంచి విడదీయడానికే ప్రోత్సహించింది" అని అనురాగ్ దోభాల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని సమర్థించుకోవడం ఈ వీడియోలో కనిపించింది.
రూ. 37 లక్షలు ఇచ్చినా బాబును చూడనివ్వట్లేదు!
తన కుమారుడు 'అనూరిత్' కోసం అన్ని అవమానాలను భరించానని, వారి తప్పులను క్షమిస్తూ వచ్చానని అనురాగ్ తెలిపారు. "నా బాబును నన్ను కలవనివ్వకుండా రితిక, ఆమె తల్లి అడ్డుకుంటున్నారు. నా నుంచి భారీగా జీవనభృతి డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకును చూసేందుకు ఇప్పటికే రూ. 37 లక్షలు ఇచ్చాను" అని అనురాగ్ కన్నీటిపర్యంతమయ్యారు.
బైక్‌లు, కార్లు అన్నింటినీ అమ్మేసి
తనకున్న బైక్‌లు, కార్లు అన్నింటినీ విక్రయించి నిలువునా ముంచేశారని, ఆర్థికంగా, చట్టపరంగా, మానసికంగా నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు కోసం సంపాదించిన ఆస్తినంతా నా అనుకున్నవాళ్లే అమ్మేశారని అనురాగ్ దోభాల్ పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాలు.. ఆత్మహత్యాయత్నం నేపథ్యం
గతంలో కూడా అనురాగ్ కుటుంబంలో తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. వేరే మతానికి చెందిన రితికను వివాహం చేసుకోవడం అనురాగ్ కుటుంబానికి నచ్చలేదని, దాంతో తన కుటుంబ సభ్యులే తనపై నకిలీ కేసులు పెట్టి వేధించారని ఆయన ఆరోపించారు.
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో
ఆ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాగ్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 'ఫైనల్ రైడ్' అంటూ కారుతో ప్రమాదానికి గురైన ఘటనా కలకలం రేపింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అనురాగ్.
కుమారుడి కోసమే జీవితం
ఇంతటి మానసిక సంఘర్షణ అనుభవించినా, తన కుమారుడి కోసం మళ్లీ సున్నా నుంచి జీవితాన్ని ప్రారంభిస్తానని, కష్టపడి తిరిగి నిలబడతానని యూట్యూబర్ అనురాగ్ దోభాల్ స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. UK07 రైడర్ ఎవరు?
యూట్యూబ్‌లో బైక్ రైడింగ్, డైలీ వ్లాగ్స్ ద్వారా విశేష ప్రాచుర్యం పొందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనురాగ్ దొభాల్.
2. అనురాగ్ దొభాల్ తన భార్యపై ఎలాంటి ఆరోపణలు చేశారు?
తన భార్య రితికా చౌహాన్ గర్భవతిగా ఉన్న సమయంలో బెస్ట్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, రూ. 37 లక్షలు తీసుకున్నా తన కుమారుడిని చూడనివ్వడం లేదని ఆరోపించారు.
3. అనురాగ్ దొభాల్ భార్య పేరేమిటి?
ఆయన భార్య పేరు రితికా చౌహాన్.
4. అనురాగ్ కొత్త వీడియో పేరేమిటి?
ఆయన తన జీవిత కథ ఆధారంగా 'అన్నాథ్' (Annath) అనే పాటతో కూడిన వ్లాగ్‌ను విడుదల చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


