...
...
Next Story

Shanmukh Jaswanth: పెళ్లి హడావిడి ముగిసేలోపే ఊహించని ట్విస్ట్.. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ బాటిల్‌తో యూట్యూబర్ షణ్ముఖ్

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్ తెలుసు కదా. ఈ మధ్యే పెళ్లితో వార్తల్లో నిలిచిన ఈ యూట్యూబర్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పై కనిపించి షాకిచ్చాడు. పెళ్లయిన మూడు రోజులకే అతడు ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ కంగు తిన్నారు.

Published on: Jun 25, 2026, 11:14:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shanmukh Jaswanth: ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతమైన ఆందోళనకు దారితీసింది. జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా వైష్ణవి చొడిశెట్టి మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ యాక్టర్.

Shanmukh Jaswanth: పెళ్లి హడావిడి ముగిసేలోపే ఊహించని ట్విస్ట్.. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ బాటిల్‌తో యూట్యూబర్ షణ్ముఖ్
Shanmukh Jaswanth: పెళ్లి హడావిడి ముగిసేలోపే ఊహించని ట్విస్ట్.. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ బాటిల్‌తో యూట్యూబర్ షణ్ముఖ్

అయితే పెళ్లయిన మూడు రోజులకే ఇలా హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ బాటిల్‌తో కనిపించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేతికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కుతున్న పిక్‌ను షన్ను పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ కాస్తా టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తిరుమలలో సీక్రెట్ వెడ్డింగ్.. వైజాగ్ లో గ్రాండ్ రిసెప్షన్

యూట్యూబ్‌లో 'సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'సూర్య' లాంటి రికార్డ్ బ్రేకింగ్ వెబ్ సిరీస్‌లతో లక్షల మంది ఆడియన్స్‌కు దగ్గరైన షణ్ముఖ్ జశ్వంత్.. గత కొన్ని నెలలుగా తన పర్సనల్ లైఫ్‌ను చాలా లో-ప్రొఫైల్‌లో మెయింటైన్ చేస్తూ వచ్చారు. పెద్దలు కుదిర్చిన సంబంధంతో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ వైష్ణవి చొడిశెట్టితో రీసెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక గత ఆదివారం (జూన్ 21) రోజున తిరుమల కొండపై అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.

ఆ వెంటనే తన సొంత ఊరైన విశాఖపట్నంలో బంధుమిత్రుల కోసం ఒక స్పెషల్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా అరేంజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. పెళ్లి ఫోటోలు నెట్‌లో వైరల్ అవుతూ ఫ్యాన్స్ నుంచి కంగ్రాచ్యులేషన్స్ వస్తున్న టైమ్‌లోనే ఈ హాస్పిటల్ సీన్ బయటపడింది.

అసలు షన్నుకు ఏమైంది? హెల్త్ కండిషన్‌పై అప్‌డేట్స్

నీరసం ఎక్కువవడంతో డాక్టర్ల సలహా మేరకు లోకల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లోనే ఈ కొత్త పెళ్లికొడుకు పూర్తిగా రికవర్ అయి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కెరీర్ గ్రాఫ్.. బిగ్ బాస్ టు సిల్వర్ స్క్రీన్ జర్నీ

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, క్రేజీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్.. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచారు. గతంలో కొన్ని పర్సనల్ లవ్ లైఫ్ బ్రేకప్స్, లీగల్ ఇష్యూస్ వల్ల కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ.. మళ్లీ పవర్‌ఫుల్ కంటెంట్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఒక క్రేజీ సినిమా ప్రాజెక్ట్‌తో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. జీవితంలో కొత్త చాప్టర్ మొదలు పెట్టిన ఈ టాలెంటెడ్ నటుడు త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా గెట్ వెల్ సూన్ మెసేజ్‌లు పెడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe