మాజీ భార్యకు దగ్గరవుతున్న క్రికెటర్.. ఆ రియాల్టీ షోలో ఇద్దరూ కలుస్తున్నారంటూ వార్తలు.. చహల్ పోస్ట్ వైరల్
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మరోసారి తన మాజీ భార్యతో కలబోతున్నాడని, ఈ ఇద్దరూ ఓ రియాల్టీ షోలో పాల్గొనబోతున్నారన్న వార్తలపై అతడు స్పందించాడు. ఇన్‌స్టా స్టోరీస్ తో అతడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో రాబోయే ఒక రియాలిటీ షో కోసం ఈ మాజీ జంట మళ్లీ చేతులు కలపబోతున్నారని, ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని నెట్టింట గుసగుసలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఊహాగానాలపై చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు.

అసలేంటీ రూమర్?
‘ది 50’ (The 50) పేరుతో రాబోయే ఒక కొత్త రియాలిటీ షోలో చహల్, ధనశ్రీ కలిసి పాల్గొంటున్నారని పలు రిపోర్టులు వెల్లడించాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపిస్తే అది సంచలనమే అవుతుందని నెటిజన్లు చర్చించుకున్నారు. ఫరా ఖాన్ హోస్ట్ చేయబోయే ఈ షో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది.
అదంతా ట్రాష్.. నమ్మకండి: చహల్
ఈ వార్తలపై చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా స్పందించాడు. ఈ రూమర్లను ఖండిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాడు. "యుజ్వేంద్ర చహల్ ఏదో రియాలిటీ షోలో పాల్గొంటున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఆ వార్తల్లో పేర్కొన్న షోతో చహల్‌కు ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. కమిట్‌మెంట్స్ ఇవ్వలేదు. దయచేసి సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దు" అని చహల్ టీమ్ స్పష్టం చేసింది. అయితే ధనశ్రీ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.
చహల్, ధనశ్రీ రిలేషన్షిప్, బ్రేకప్ ఇలా..
లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ డ్యాన్స్ క్లాసుల ద్వారా పరిచయమైన చహల్, ధనశ్రీ.. ప్రేమలో పడి డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. అయితే మనస్పర్ధల కారణంగా జూన్ 2022లో విడిపోయారు. గతేడాది (2025) మార్చిలో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.
ధనశ్రీతో విడిపోయిన తర్వాత చహల్ దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో ఆర్జే మహ్వాష్‌తో (RJ Mahvash) కనిపించడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చినా, తాము కేవలం స్నేహితులమేనని మహ్వాష్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు, ధనశ్రీ గతంలో ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో పాల్గొని తన వైవాహిక జీవితం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


