Apsara Awards: అప్సర అవార్డ్స్ మళ్లీ వచ్చేశాయ్.. జీ తెలుగులో వీకెండ్ సందడి.. తారల డ్యాన్స్‌లు, మ్యూజికల్ పర్ఫార్మెన్స్

Apsara Awards: జీ తెలుగు ఛానెల్లో ఈ వీకెండ్ అవార్డుల సందడి ఉండనుంది. అప్సర అవార్డులు 2026 వచ్చేశాయి. సుధీర్, ప్రదీప్ యాంకరింగ్ కు తోడు.. టాలీవుడ్ స్టార్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఈ ఈవెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచనుంది.

Published on: May 27, 2026, 15:30:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Apsara Awards: మహిళల శక్తి, సామర్థ్యాలు, సాధించిన విజయాలు, వారి లెగసీకి సెల్యూట్ చేస్తూ.. జీ తెలుగు (Zee Telugu) తమ ప్రతిష్టాత్మక వేడుక ‘అప్సర అవార్డ్స్ 2026’ (Apsara Awards 2026)తో మన ముందుకు రాబోతోంది. గ్లామర్, ఎమోషన్, ఇన్‌స్పిరేషన్ కలగలిపిన ఈ గ్రాండ్ ఈవెంట్ ఈ శనివారం (మే 30) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

Apsara Awards: అప్సర అవార్డ్స్ మళ్లీ వచ్చేశాయ్.. జీ తెలుగులో వీకెండ్ సందడి.. తారల డ్యాన్స్‌లు, మ్యూజికల్ పర్ఫార్మెన్స్
Apsara Awards: అప్సర అవార్డ్స్ మళ్లీ వచ్చేశాయ్.. జీ తెలుగులో వీకెండ్ సందడి.. తారల డ్యాన్స్‌లు, మ్యూజికల్ పర్ఫార్మెన్స్

బుల్లితెరపై గ్లామర్ హంగామా.. ప్రదీప్, సుధీర్ ఎంట్రీ

ఈ స్టార్ల వేడుకను పాపులర్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ తమదైన స్టైల్లో పవర్‌ఫుల్ ఓపెనింగ్ యాక్ట్‌తో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జీ తెలుగు ‘అప్సరసల’ (సీరియల్ నటీమణులు) మెస్మరైజింగ్ ర్యాంప్ వాక్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వీటితోపాటు పలు ఇతర ప్రధాన పర్ఫార్మెన్స్ లు ఉర్రూతలూగించనున్నాయి.

గ్లామర్ డ్యాన్స్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి, ఖ్యాతి లతో పాటు పలువురు టీవీ తారలు స్టేజ్‌పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో అలరించనున్నారు.

మ్యూజికల్ మెడ్లీ: యాంకర్ ప్రదీప్, యష్మి, నవ్య స్వామి కలిసి ఒక వైబ్రెంట్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

మాస్ డ్యాన్స్: సుడిగాలి సుధీర్, కావ్య కాంబినేషన్‌లో వచ్చే హై-ఎనర్జీ డ్యాన్స్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనుంది.

‘అమ్మవారు’ యాక్ట్.. కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్

ఈ వేడుకలో కేవలం వినోదం మాత్రమే కాకుండా గుండెలను హత్తుకునే ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఉన్నాయి. ‘అమ్మవారు’ ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకోనుంది. స్త్రీత్వంలోని విభిన్న రూపాలను, వారి అంతర్గత శక్తిని ఆవిష్కరిస్తూ దుర్గ, కాళి, అర్ధనారీశ్వరుడు వంటి దైవ అవతారాలలో ప్రదర్శించిన ‘అమ్మవారు’ యాక్ట్ వీక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఆలోచింపజేసేలా ఉంటుంది.

దీనితో పాటు పాతకాలపు సినీ మైలురాళ్లను గుర్తుచేస్తూ ‘డ్రామా జూనియర్స్’ పిల్లలు లెజెండరీ నటీనటులకు, సినిమాలకు అందించిన క్లాసిక్ ట్రిబ్యూట్ అన్ని తరాల వారిని ఆకట్టుకోనుంది.

అవార్డులు - విజేతల వివరాలు

టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సీనియర్ నటీమణులతో పాటు నేటితరం స్టార్స్ ఈ వేడుకలో అవార్డులు అందుకోనున్నారు. జయసుధ, జయప్రద, భూమిక చావ్లా, మీనా, రాశీ ఖన్నా, వరలక్ష్మి శరత్‌కుమార్, నివేదా థామస్, ప్రగతి వంటి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో మెరవనున్నారు.

నారీ శక్తి అవార్డును స్క్వాడ్రన్ లీడర్ రాగి రామచంద్రన్ అందుకోనుండగా.. మాతృమూర్తి అవార్డును డాక్టర్ సూరి శ్రీమతి అందుకుంటారు. ఈ అవార్డులను సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రదలాంటి వాళ్లు అందజేస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. జీ తెలుగు ‘అప్సర అవార్డ్స్ 2026’ ఎప్పుడు ప్రసారం కానుంది?

ఈ అవార్డుల వేడుక మే 30, శనివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో గ్రాండ్‌గా ప్రసారం కానుంది.

2. అప్సర అవార్డుల ఈవెంట్‌కు హోస్ట్‌లుగా ఎవరు వ్యవహరిస్తున్నారు?

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ ఈ షోకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తూ తమ కామెడీ, టైమింగ్‌తో సందడి చేయనున్నారు.

3. 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతికి ఏ అవార్డు లభించింది?

ఆమె జీవితకాల వైద్య సేవలను గుర్తిస్తూ జీ తెలుగు ‘మాతృ మూర్తి అవార్డు’ను అందించింది. ఈ పురస్కారాన్ని సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద సంయుక్తంగా అందజేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More