పండగ వస్తుందంటే చాలు తెలుగు టీవీ ఛానెల్స్ లో హంగామా మొదలవుతుంది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి పోటీపడి స్పెషల్ షోలు, సినిమాలతో సందడి చేస్తుంటాయి. ఈ సంక్రాంతికి కూడా జీ తెలుగు ఛానెల్ పలు షోలతో అలరించబోతోంది. ఈ ఆదివారం (జనవరి 11) నుంచే ఆ ఛానెల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ వివరాలు చూడండి.
జీ తెలుగు సంక్రాంతి సందడి

ప్రతి పండగ మాదిరిగానే ఈ సంక్రాంతి వేళ తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించడానికి జీ తెలుగు సిద్ధమైంది. కామెడీ డ్రామా 'మిత్ర మండలి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటు, టాలీవుడ్ స్టార్స్ సందడి చేసిన సంక్రాంతి స్పెషల్ 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' ఈవెంట్‌ను అందిస్తోంది.
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ జంటగా అలరించిన మిత్ర మండలి జనవరి 11 (ఆదివారం) మధ్యాహ్నం 3:30లకు, మాస్‌మహారాజ్ రవితేజ సందడి చేసిన 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నాయి. ప్రస్తుతం మిత్ర మండలి మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నలుగురు ఫ్రెండ్స్ జీవితాల్లోకి ఓ పొలిటీషియన్ కూతురు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ కథ.
సంక్రాంతి స్పెషల్ షోలు ఇలా..
ఇక సంక్రాంతి సంబరాలను స్టార్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుధీర్ తమదైన శైలిలో హోస్ట్ చేస్తూ వినోదాన్ని పంచబోతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి పెళ్లి, ఆశల గురించి చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. మెగా విక్టరీ సాంగ్‌ను రీక్రియేట్ చేయడంతో పాటు సుధీర్-ప్రదీప్ పట్ల అమ్మాయిలు చూపే ప్రేమ, ఒకరి అభిమానులను మరొకరు ఎగతాళి చేసుకునే సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనున్నాయి.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పేరుతో చిన్న పిల్లలు వేసే స్కిట్లు ఈ షోలో భాగం కానున్నాయి. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ తన హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
{{/usCountry}}'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పేరుతో చిన్న పిల్లలు వేసే స్కిట్లు ఈ షోలో భాగం కానున్నాయి. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ తన హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
{{/usCountry}}ఇక సాయంత్రాన్ని మరింత కలర్ ఫుల్ గా మారుస్తూ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ 'ది రాజా సాబ్' హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సరదా కబుర్లు, అల్లరి, ఆటపాటలతో సందడిగా సాగిన జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ మిస్ కాకుండా చూడండి.