Zee5 Telugu: జీ5 తెలుగు ప్లాట్‌ఫామ్ జులై నెలలో ఓటీటీ ఆడియన్స్‌కు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విందును వడ్డించబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా జోనర్లతో సరికొత్త కంటెంట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ జోష్ నింపింది.
జీ5 తెలుగు జులై లైనప్ ఇలా

ఈ జులై నెలకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ క్యాలెండర్‌ను జీ5 తెలుగు తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇందులో ముఖ్యంగా వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్న సినిమా ఉండటంతో నెటిజన్లలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
* జులై 3: వీరభద్రుని రహస్యం (సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - 60 ఎపిసోడ్లు)
* జులై 17: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ)
* కమింగ్ సూన్: అబ్జెక్షన్ మై లార్డ్ (శ్రీకాంత్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)
జులై 3 నుంచే షురూ: మిస్టరీ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'
జులై రేస్‌లో అందరికంటే ముందుగా 'వీరభద్రుని రహస్యం' వెబ్ సిరీస్ జీ5 తెలుగులో అడుగుపెట్టింది. మొత్తం 60 ఎపిసోడ్ల మెగా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు రాగా.. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు చేర్చబోతున్నారు. ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ చుట్టూ డైరెక్టర్ ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా మలిచాడు.
జులై 17 న వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'
ఈ జులై నెలలోనే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' కూడా వస్తోంది. 1990ల నాటి వింటేజ్ హీరో వడ్డే నవీన్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. జులై 17న డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నారు.
{{/usCountry}}ఈ జులై నెలలోనే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' కూడా వస్తోంది. 1990ల నాటి వింటేజ్ హీరో వడ్డే నవీన్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. జులై 17న డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నారు.
{{/usCountry}}ఇందులో వడ్డే నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్ చుట్టూ జరిగే పొరపాట్లు, ఆఫీస్ పాలిటిక్స్ ను హిలేరియస్‌గా చూపిస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని డిజైన్ చేశారు. వడ్డే నవీన్ మార్క్ టైమింగ్, రాశీ సింగ్ గ్లామర్ సినిమాకు మెయిన్ అసెట్స్ కానున్నాయి.
కమింగ్ సూన్: ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా 'అబ్జెక్షన్ మై లార్డ్'
ఇక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ను కూడా జీ5 తెలుగు ప్లాన్ చేసింది. త్వరలోనే సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన అబ్జెక్షన్ మై లార్డ్ అనే కోర్టు రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ను కూడా తీసుకొస్తోంది. ఇది ఈ నెల చివర్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా.. త్వరలోనే అని మాత్రం చెప్పింది. ఈ మూడు క్రేజీ ప్రాజెక్టులను కలిపి ఓ చిన్న వీడియోతో జీ5 తెలుగు జులై రిలీజెస్ పై అంచనాలు పెంచేసింది.