2026 Makara Sankranti Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026 సందేశాలు

2026 Makara Sankranti Wishes: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి రెండు రోజులు ముందే మొదలైపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా చాలా మంది కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఇప్పటికే వారి ఊరికి వెళ్లి ఉంటారు. అయితే ఈ పండక్కి మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలనుకుంటే, ఈ విషెస్‌ను వారితో షేర్ చేసుకోండి.

Updated on: Jan 15, 2026, 07:28:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 Makara Sankranti Wishes: సంక్రాంతి పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి రెండు రోజులు ముందే మొదలైపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా చాలా మంది కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఇప్పటికే వారి ఊరికి వెళ్లి ఉంటారు. అయితే ఈ పండక్కి మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలనుకుంటే, ఈ విషెస్‌ను వారితో షేర్ చేసుకోండి.

2026 Makara Sankranti Wishes: సంక్రాంతి విషెస్ & కోట్స్ (pinterest)
2026 Makara Sankranti Wishes: సంక్రాంతి విషెస్ & కోట్స్ (pinterest)

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026

  1. సంబరాల సంక్రాంతి జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
  2. సంక్రాంతి అంటేనే సందడి. ఈ విశిష్టమైన పండుగ మీకు సరికొత్త ఆనందాలు తీసుకురావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి 2026.
  3. మన తెలుగు వారి పండుగ సంక్రాంతి ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలి. హ్యాపీ సంక్రాంతి 2026.
  4. ఈ సంక్రాంతి మరింత ఆనందాలను, మరిన్ని సంతోషాలను తీసుకురావాలి. జీవితం సంతోషాలతో నిండిపోవాలి. హ్యాపీ సంక్రాంతి 2026.
  5. ఆ పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు, సంక్రాంతి పండుగ మీ జీవితంలోకి సరికొత్త ఆనందాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.
  6. ఈ సంక్రాంతి మీకు సుఖ సంతోషాలను ఇవ్వాలని, కనుమ కమనీయ అనుభూతులు మిగలచాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
  7. ఈ సంక్రాంతి పండుగ ఇంట కొత్త వెలుగులు నింపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
  8. ఈ సంక్రాంతితో కష్టాలన్నీ తొలగిపోవాలి. ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
  9. ఈ సంక్రాంతి ఆనందం, ప్రేమను అందించాలని, ఈ పండుగ కొత్త ప్రారంభాలు, ఆనంద లక్షణాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి 2026
  10. ఈ సంక్రాంతి జీవితంలో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని, ఆనందం, ప్రేమ మీ కుటుంబంలో నిలిచిపోవాలని, విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి 2026.
  11. ఈ మకర సంక్రాంతి అంతులేని ఆనందాలతో పాటు కోరుకున్న విజయాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి 2026.
  12. ఈ సంక్రాంతి పండుగ ప్రేమ, నవ్వులు, శ్రేయస్సును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
  13. ఆ పతంగుల్లా మీ జీవితం కలర్‌ఫుల్‌గా మారాలని, అంతులేని తీరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మకర సంక్రాంతి 2026.
  14. మకర సంక్రాంతి మధుర క్షణాలను అందించాలని, కుటుంబం, స్నేహితులతో మరపురాని జ్ఞాపకాలు పొందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి 2026.
  15. 2026లో మొదటి పండుగ మీ విజయాలకు నాంది పలకాలని.. ప్రేమ, సంతోషం జీవితంలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ సంక్రాంతి 2026.
  16. సంక్రాంతి మీకు అదృష్టాన్ని, విజయాన్ని తీసుకురావాలని, కుటుంబంలో ప్రేమ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026
  17. 2026లో వచ్చిన ఈ భోగి మీకు భోగభాగ్యాలు అందించాలని, సంక్రాంతి సందడి తీసుకురావాలని, కనుమ మధుర జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026.
  18. మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ ప్రేమ, నవ్వులు, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More