Soul Journey Signs : మీకు తెలియని ప్రదేశం లేదా భయం వెంటాడుతోందా…? ఈ 8 సంకేతాలు తెలుసుకోండి

Soul Journey Signs : మనం ఎప్పుడూ వెళ్లని ప్రదేశం పట్ల మక్కువ, వివరించలేని భయాల వెనక కొన్ని కారణాలుంటాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ మన గత ప్రయాణానికి సంబంధించిన ఆనవాళ్లు కావొచ్చని అంచనా. ఆధ్యాత్మిక గైడ్ జానికా గాలోవే వివరించిన 8 ఆసక్తికర సంకేతాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 7, 2026, 19:31:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Soul Journey Signs : మన జీవితంలో కొన్నిసార్లు తర్కానికి అందని అనుభూతులు కలుగుతుంటాయి. కొంతమంది వ్యక్తులను కలవగానే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అనిపించడం, కొన్ని శబ్దాలు లేదా దృశ్యాలు చూసినప్పుడు తెలియని భయం కలగడం వంటివి మనం అనుభవిస్తూనే ఉంటాం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం….. మన ఆత్మ ఈ భూమిపైకి రాకముందే సుదీర్ఘ ప్రయాణం చేసిందని, ఆ పాత జ్ఞాపకాలే ప్రస్తుత జీవితంలో ఇలాంటి సంకేతాల రూపంలో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మీకు తెలియని ప్రదేశం లేదా భయం వెంటాడుతోందా? ఇవే ఆ 8 ఆధ్యాత్మిక సంకేతాలు! (Pinterest)
మీకు తెలియని ప్రదేశం లేదా భయం వెంటాడుతోందా? ఇవే ఆ 8 ఆధ్యాత్మిక సంకేతాలు! (Pinterest)

ఆధ్యాత్మిక గైడ్ జానికా గాలోవే ప్రకారం…. మీ ఆత్మ మోస్తున్న ఆ అదృశ్య జ్ఞాపకాలను గుర్తించే 8 ప్రధాన సంకేతాలు ఇవే:

1. వివరించలేని భయాలు (Phobias)..

మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఎదుర్కోని సంఘటనల పట్ల తీవ్రమైన భయం ఉండటం. ఉదాహరణకు…. నీటిని చూస్తే భయం లేదా ఎత్తైన ప్రదేశాలంటే వణుకు. మీ ప్రస్తుత జీవితంలో అలాంటి ప్రమాదమేదీ జరగకపోయినా, ఈ భయాలు మీ ఆత్మ మోస్తున్న పాత జ్ఞాపకాల వల్ల కలగవచ్చని ఆధ్యాత్మిక నమ్మకం.

2. తెలియని ప్రదేశం లేదా సంస్కృతిపై మక్కువ..

మీరు ఎప్పుడూ వెళ్లని దేశం, అక్కడ మాట్లాడే భాష లేదా అక్కడి సంప్రదాయాలు మీకు చాలా సన్నిహితంగా అనిపిస్తాయి. ఏదో తెలియని లోతైన అనుబంధం మిమ్మల్ని ఆ సంస్కృతి వైపు లాగుతుంది. ఇది మీ ఆత్మ గతంలో అక్కడ గడిపిన కాలానికి గుర్తు కావచ్చు.

3. తక్షణ - తీవ్రమైన సంబంధాలు..

కొంతమందిని మొదటిసారి కలిసినప్పుడే వారిని పూర్తిగా నమ్మేయడం లేదా వారితో లోతైన భావోద్వేగ బంధం ఏర్పడటం జరుగుతుంది. వీరు మీకు 'ఆత్మ బంధువులు' (Soulmates) లాగా అనిపిస్తారు. అసంపూర్ణంగా మిగిలిన పాఠాలను పూర్తి చేయడానికి ఇలాంటి సంబంధాలు మళ్లీ ఎదురవుతాయని ఆధ్యాత్మిక బోధనలు చెబుతున్నాయి.

4. అంతుచిక్కని అంతర్గత జ్ఞానం..

ఎవరూ చెప్పకుండానే కొన్ని విషయాల గురించి మీకు ముందే తెలిసిపోవడం లేదా గట్టిగా నమ్మడం. మీ అంతర్ దృష్టి (Intuition) చాలా బలంగా ఉంటుంది. దీనిని ఆత్మ గతంలో గడించిన అనుభవం నుండి పొందిన జ్ఞానంగా పరిగణిస్తారు.

5. సహజ సిద్ధమైన ప్రతిభ..

కొంతమందికి సంగీతం, చిత్రలేఖనం లేదా బోధన వంటి కళలు ఎటువంటి శిక్షణ లేకుండానే అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఇది నేర్చుకోవడం లాగా కాకుండా…. మర్చిపోయిన దాన్ని మళ్లీ 'గుర్తు తెచ్చుకోవడం' లాగా అనిపిస్తుంది.

6. పునరావృతమయ్యే జీవన విధానాలు..

మీ జీవితంలో ఒకే రకమైన సమస్యలు లేదా సంఘటనలు పదే పదే వివిధ రూపాల్లో ఎదురవుతుంటే.. మీ ఆత్మ ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థం. ఆ పాఠం నేర్చుకునే వరకు ఆ నమూనా మారుతూనే ఉంటుంది.

7. పునరావృత కలలు..

కొన్ని కలలు దశాబ్దాల పాటు మీ వెంటే ఉంటాయి. అవి కలలు లాగా కాకుండా నిజంగా జరిగిన అనుభవాల లాగా అనిపిస్తాయి. మేల్కొన్నప్పుడు మన మనస్సు గ్రహించలేని జ్ఞాపకాలను ఆత్మ కలల ద్వారా సందేశాలుగా పంపుతుంది.

8. వివరించలేని శారీరక అనుభూతులు..

వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా శరీరంలో కొన్ని చోట్ల నిరంతరం ఒత్తిడి లేదా నొప్పి అనిపించడం. ఆధ్యాత్మిక కోణంలో ఇది పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేయని పాత భావోద్వేగాల బరువు కావచ్చు.

గమనిక : ఈ వ్యాసంలోని ఆలోచనలు ఆధ్యాత్మిక నమ్మకాలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలపై ఆధారపడి ఉన్నాయి. శాస్త్రీయ ఆధారాలు కాదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More