భానుడి భగభగలకు వేసవి కాలంలో ఇళ్లు, గదులు సెగలు కక్కుతుంటాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ (AC) వైపు మొగ్గు చూపుతారు. అయితే గది త్వరగా చల్లబడాలని చాలా మంది ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ కూడా వేస్తుంటారు. మరికొందరేమో ఇలా ఏసీ, ఫ్యాన్ కలిపి నడపడం వల్ల కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతుందని, ఫ్యాన్ గాలి వల్ల ఏసీ కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి మిషన్ పాడైపోతుందని భయపడుతుంటారు.

సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నమ్మకం పూర్తిగా తప్పు. వీటిని సరైన పద్ధతిలో కలిపి ఉపయోగిస్తే గది రెట్టింపు వేగంతో చల్లబడుతుంది, ఏసీపై లోడ్ పడదు మరియు మీ కరెంటు బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
వేసవిలో గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏసీని నేరుగా 16 లేదా 18 డిగ్రీల వంటి తక్కువ ఉష్ణోగ్రతపై ఉంచి రన్ చేస్తే… గదిని చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ సమయం పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏసీ మిషన్‌పై విపరీతమైన లోడ్ పడి, విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఫలితంగా మీ చేతికి వచ్చే కరెంటు బిల్లు గుండెల్లో గుబులు రేపుతుంది.
ఏసీ, ఫ్యాన్ కలిపి నడిపితే ఏం జరుగుతుంది?
మీరు గదిలో కేవలం ఏసీ మాత్రమే ఆన్ చేసినప్పుడు, అది గదిలోని వేడి గాలిని లాగేసుకుని చల్లటి గాలిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ చల్లదనం గది అంతటా సమానంగా వ్యాపించడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటే ఏసీతో పాటు ఫ్యాన్‌ను కూడా 2 లేదా 3 వ నంబర్ స్పీడ్‌లో రన్ చేయాలి.
ఫ్యాన్ తిరగడం వల్ల ఏసీ విడుదల చేసే చల్లటి గాలి గదిలోని ప్రతి మూలకు, ప్రతి వైపుకు త్వరగా చేరుకుంటుంది. ఉదాహరణకు… మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద సెట్ చేసి, ఫ్యాన్‌ను 3 వ నంబర్ స్పీడ్‌లో పెడితే.. ఫ్యాన్ గాలి వల్ల గదిలో ‘విండ్ చిల్ ఎఫెక్ట్’ (గాలి తీవ్రత వల్ల కలిగే చల్లదనం) ఏర్పడుతుంది. గది 18 డిగ్రీల వద్ద ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్ త్వరగా ఆటో-కట్ అవుతుంది. ఏసీ తక్కువ సమయం పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు స్వయంచాలకంగా తగ్గుతుంది ఎయిర్ కండిషనర్ యంత్రం జీవితకాలం పెరుగుతుంది. ఫ్యాన్ సహాయంతో మీరు ఏసీ ఉష్ణోగ్రతను 24, 25 లేదా 26 డిగ్రీల వద్ద ఉంచినా కూడా గది శీతలంగా మారుతుంది.
ఉక్కపోత, వింత వాసనలకు చెక్
{{/usCountry}}ఫ్యాన్ తిరగడం వల్ల ఏసీ విడుదల చేసే చల్లటి గాలి గదిలోని ప్రతి మూలకు, ప్రతి వైపుకు త్వరగా చేరుకుంటుంది. ఉదాహరణకు… మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద సెట్ చేసి, ఫ్యాన్‌ను 3 వ నంబర్ స్పీడ్‌లో పెడితే.. ఫ్యాన్ గాలి వల్ల గదిలో ‘విండ్ చిల్ ఎఫెక్ట్’ (గాలి తీవ్రత వల్ల కలిగే చల్లదనం) ఏర్పడుతుంది. గది 18 డిగ్రీల వద్ద ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్ త్వరగా ఆటో-కట్ అవుతుంది. ఏసీ తక్కువ సమయం పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు స్వయంచాలకంగా తగ్గుతుంది ఎయిర్ కండిషనర్ యంత్రం జీవితకాలం పెరుగుతుంది. ఫ్యాన్ సహాయంతో మీరు ఏసీ ఉష్ణోగ్రతను 24, 25 లేదా 26 డిగ్రీల వద్ద ఉంచినా కూడా గది శీతలంగా మారుతుంది.
ఉక్కపోత, వింత వాసనలకు చెక్
{{/usCountry}}చాలా మంది రాత్రిపూట ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు గదిలో తేమ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. బెడ్‌షీట్లు, దుస్తులు కాస్త పచ్చిగా అనిపించడం లేదా గదిలో ఒక రకమైన వింత వాసన రావడం వల్ల కొందరికి సరిగ్గా నిద్ర పట్టదు. ఏసీతో పాటు లైట్‌గా ఫ్యాన్ కూడా నడిపితే గదిలో గాలి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. దీనివల్ల గదిలోని తేమ మాయమై, గాలి తాజాగా మారుతుంది. ఇది హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
మరికొన్ని చిట్కాలు:
చిన్న గది అయితే: మీ బెడ్‌రూమ్ పరిమాణం చిన్నదిగా ఉంటే, మొదట ఏసీని 22 డిగ్రీల ఉష్ణోగ్రతకు సెట్ చేసి కొంతసేపు రన్ చేయండి. ఆ సమయంలో ఫ్యాన్ ఆఫ్ చేయండి. గది కాస్త చల్లబడిన తర్వాత ఏసీ ఉష్ణోగ్రతను 24 లేదా 25కి పెంచి… ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో (1 లేదా 2 నంబర్) ఆన్ చేయండి.
పెద్ద గది అయితే : గది పరిమాణం పెద్దదైతే ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్‌ను మీడియం స్పీడ్‌లో రన్ చేయడం వల్ల చల్లటి గాలి త్వరగా రూమ్ అంతా విస్తరిస్తుంది.
గమనిక: ఏసీ ఆన్ చేయడానికి ముందే గది కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. తలుపుల సందుల గుండా చల్లటి గాలి బయటకు వెళ్లకుండా ఉంటేనే గది త్వరగా చల్లబడుతుంది.