సాంకేతిక నగరంగా పేరుగాంచిన బెంగుళూరులో ఒక పక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోలాహలం కనిపిస్తుంటే, మరోపక్క బతుకు బండిని లాగడానికి సగటు మనిషి పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సుమారు ఏడాదిన్నర పాటు నిరుద్యోగంతో కుదేలై, చివరకు క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
వ్యాపారం దెబ్బతిని.. అప్పుల ఊబిలో చిక్కుకుని..

రెడ్డిట్ వేదికగా ఆ వ్యక్తి తన గోడును వెళ్లగక్కారు. “దాదాపు 1.5 ఏళ్ల పాటు నిరుద్యోగిగా ఉన్నాను. మధ్యలో ఒక వ్యాపారం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాను. లోన్లు, క్రెడిట్ కార్డు అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో గత నెలలో రోజుకు రూ. 1500 అద్దెకు ఒక కారు తీసుకుని క్యాబ్ నడపడం ప్రారంభించాను” అని ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
సంపాదన రూ. 4000.. మిగిలేది మాత్రం రూ. 1000
ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లలో రోజుకు దాదాపు 16 గంటల పాటు ఆయన డ్యూటీ చేస్తున్నారు. తన సంపాదన లెక్కలను వివరిస్తూ.. “రోజుకు రూ. 4,000 వరకు సంపాదిస్తాను. అందులో రూ. 1,500 కారు అద్దెకు, రూ. 1,200 సీఎన్‌జీ (CNG) గ్యాస్‌కు, మరో రూ. 200 భోజనానికి పోతాయి. చివరకు చేతికి మిగిలేది కేవలం రూ. 1,000 మాత్రమే. బెంగుళూరు ట్రాఫిక్‌లో 16 గంటలు స్టీరింగ్ పట్టుకోవడం చాలా నరకప్రాయంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
శారీరక శ్రమ.. యాప్‌ల ఒత్తిడి
కేవలం ఆర్థిక ఇబ్బందులే కాకుండా, శారీరక సమస్యలు కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. రోజుకు కేవలం 6 గంటలే నిద్రపోతూ, మిగిలిన సమయమంతా రోడ్డుపైనే గడుపుతుండటంతో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని చెప్పారు.
“యాప్‌లు ఒక రాక్షసుడిలా తయారయ్యాయి. ఇండియాలో ఇదొక గాడిద చాకిరీలా మారిపోయింది. ఆర్డర్ వచ్చిన 5-6 సెకన్లలోనే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రేటింగ్ తగ్గిపోతుంది. కోట్లాది మంది భారతీయుల వాస్తవికత ఇది. ఎదుటివారికి సౌకర్యం కలగడానికి మనలాంటి వాళ్లు చౌక కార్మికులుగా మిగిలిపోతున్నారు. దోపిడీ చేసేవాడిగా అన్నా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యే వాడిగా అన్నా మిగలాలి. అసలు ఇది ఒక జీవితమేనా?” అని ఆయన ప్రశ్నించారు.
నెటిజన్ల స్పందన
{{/usCountry}}“యాప్‌లు ఒక రాక్షసుడిలా తయారయ్యాయి. ఇండియాలో ఇదొక గాడిద చాకిరీలా మారిపోయింది. ఆర్డర్ వచ్చిన 5-6 సెకన్లలోనే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రేటింగ్ తగ్గిపోతుంది. కోట్లాది మంది భారతీయుల వాస్తవికత ఇది. ఎదుటివారికి సౌకర్యం కలగడానికి మనలాంటి వాళ్లు చౌక కార్మికులుగా మిగిలిపోతున్నారు. దోపిడీ చేసేవాడిగా అన్నా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యే వాడిగా అన్నా మిగలాలి. అసలు ఇది ఒక జీవితమేనా?” అని ఆయన ప్రశ్నించారు.
నెటిజన్ల స్పందన
{{/usCountry}}ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. “ఇది చాలా కష్టమైన పని. కచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
“మనం క్యాబ్ డ్రైవర్లను చాలా తేలికగా తీసుకుంటాం. ఈ పోస్ట్ చదివాక వారి వెనుక ఉన్న మానసిక, శారీరక వేదన అర్థమవుతోంది” అని మరొకరు పేర్కొన్నారు.
“డ్రైవర్లు ఎందుకు అంత కోపంగా ఉంటారో, ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు అతిక్రమిస్తారో ఇప్పుడు అర్థమవుతోంది. వారు అనుభవిస్తున్న కష్టాలే వారిని అలా మారుస్తున్నాయి” అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
జీవన పోరాటంలో అలుపెరగని శ్రమ చేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల దీనస్థితికి ఈ డ్రైవర్ గాథ ఒక నిదర్శనం.