డయాబెటిస్‌కు, గుండె జబ్బులకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. షుగర్ ఉన్నవారిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు, ఆ పనితీరును నియంత్రించే నరాలు క్రమంగా బలహీనపడతాయి.
గుండెపై డయాబెటిస్ ప్రభావం ఎలా ఉంటుంది?

రక్తనాళాల్లో అడ్డంకులు: రక్తంలో అధిక చక్కెర వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ త్వరగా పేరుకుపోతుంది. దీనివల్ల ధమనులు ఇరుకుగా మారి రక్తం సరఫరా తగ్గుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్: టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగా పని చేయదు. దీనివల్ల శరీరంలో వాపు (Inflammation) పెరిగి రక్తనాళాల ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది.
అదనపు ముప్పులు: డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా బీపీ, అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తోడవుతాయి. ఇవన్నీ కలిసి గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి.
ముందస్తు సంకేతాలను గుర్తించండి డయాబెటిస్ ఉన్నవారు చిన్నపాటి మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా:
- కారణం లేకుండా విపరీతమైన అలసట రావడం.
- నడుస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ఛాతిలో నొప్పి.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
- కాళ్లలో వాపు రావడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.
రక్షణ మార్గాలు
ఇవి పాటిస్తే గుండె పదిలం డయాబెటిస్ ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
షుగర్ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను డాక్టర్ సూచించిన పరిమితిలో ఉంచుకోవాలి.
క్రమం తప్పని వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం గుండెకు బలాన్నిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, ఉప్పు, తీపి తగ్గించాలి.
{{/usCountry}}ఆరోగ్యకరమైన ఆహారం: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, ఉప్పు, తీపి తగ్గించాలి.
{{/usCountry}}పొగతాగడం వద్దు: ధూమపానం వల్ల రక్తనాళాలు త్వరగా మూసుకుపోతాయి, కాబట్టి దీనికి దూరంగా ఉండాలి.
నిద్ర, ఒత్తిడి: సరిపడా నిద్ర (7-8 గంటలు) లేకపోవడం వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి.
సరైన సమయంలో చికిత్స, క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తే డయాబెటిస్ బాధితులు కూడా సాధారణ వ్యక్తుల్లాగే ఆరోగ్యంగా, చురుగ్గా జీవించవచ్చు.
- డాక్టర్ ఎన్. మురళీకృష్ణ,
కన్సల్టెంట్, కార్డియాలజీ విభాగం
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ