సాధారణ ఆరోగ్య పరీక్షలు లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎక్స్‌రే, స్కానింగ్ తీయించుకున్నప్పుడు 'గుండె పరిమాణం పెరిగింది' (Enlarged Heart) అని రిపోర్టులో రావడం చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. అయితే, గుండె పెద్దదిగా కనిపించడానికి అధిక రక్తపోటు (బీపీ), గుండె కవాటాల (వాల్వు) సమస్యలు, తీవ్రమైన రక్తహీనత (ఎనీమియా), గర్భధారణ లేదా గుండెపై భారం పెంచే ఇతర అంశాలు కారణం కావచ్చు. కొన్నిసార్లు గుండె కండరాల వ్యాధి అయిన 'కార్డియోమయోపతి' వల్ల కూడా ఇలా జరుగుతుంది.
కార్డియోమయోపతి అంటే ఏమిటి?

గుండె కండరాల పరిమాణం, మందం లేదా రక్తాన్ని పంప్ చేసి రిలాక్స్ అయ్యే సామర్థ్యంలో వచ్చే మార్పులను 'కార్డియోమయోపతి' అంటారు. గుండె చుట్టూ అసాధారణంగా నీరు చేరడం లేదా గుండె కవాటాల లోపాలు ఉండటం వల్ల కూడా ఎక్స్‌రేలో గుండె పెద్దదిగా కనిపించే అవకాశముంది.
కార్డియోమయోపతిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి:
డైలేటెడ్ కార్డియోమయోపతి: ఇందులో రక్తాన్ని పంప్ చేసే ప్రధాన గుండె గదులు (ఛేంబర్స్) పెద్దవిగా మారి, వాటి పంపింగ్ సామర్థ్యం తగ్గి బలహీనపడతాయి.
హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి: ఇందులో గుండె కండరాలు అసాధారణంగా మందంగా తయారవుతాయి. ఇది శరీరానికి జరిగే రక్తసరఫరాకు ఆటంకం కలిగిస్తుంది.
లక్షణాలు లేకపోయినా ప్రమాదమేనా?
కార్డియోమయోపతి ఉన్న చాలామందిలో ప్రారంభంలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అందుకే రిపోర్టులో కేవలం "గుండె పరిమాణం పెరిగింది" అని ఉన్నంత మాత్రాన సమస్య తీవ్రత ఎంత ఉందో చెప్పలేం.
గుండె నిర్మాణం, అది రక్తాన్ని ఎంత సమర్థవంతంగా పంప్ చేస్తోందో పక్కాగా తెలుసుకోవడానికి 'ఎకో-కార్డియోగ్రామ్' (Echo) పరీక్ష తప్పనిసరి. ఆ ఫలితాల ఆధారంగా ఈసీజీ (ECG), రక్త పరీక్షలు, కార్డియాక్ ఎమ్మారై (MRI) వంటి తదుపరి పరీక్షలను వైద్యులు నిర్ణయిస్తారు.
ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మీ దైనందిన జీవనశైలిలో వచ్చే చిన్న చిన్న మార్పులను గమనిస్తుండటం చాలా ముఖ్యం.
- మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడటం, గతంతో పోలిస్తే వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం.
- కాళ్ల చీలమండల వద్ద వాపులు రావడం.
- విపరీతమైన అలసట, గుండె దడ, తల తిరగడం లేదా స్పృహ తప్పడం.
- ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరిగి పడిపోవడం, సడన్‌గా గుండె వేగంగా లేదా లయ తప్పి కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం వంటివి ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
కుటుంబ చరిత్ర - జన్యుపరమైన ప్రమాదాలు
{{/usCountry}}మీ దైనందిన జీవనశైలిలో వచ్చే చిన్న చిన్న మార్పులను గమనిస్తుండటం చాలా ముఖ్యం.
- మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడటం, గతంతో పోలిస్తే వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం.
- కాళ్ల చీలమండల వద్ద వాపులు రావడం.
- విపరీతమైన అలసట, గుండె దడ, తల తిరగడం లేదా స్పృహ తప్పడం.
- ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరిగి పడిపోవడం, సడన్‌గా గుండె వేగంగా లేదా లయ తప్పి కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం వంటివి ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
కుటుంబ చరిత్ర - జన్యుపరమైన ప్రమాదాలు
{{/usCountry}}కుటుంబంలో ఎవరికైనా కార్డియోమయోపతి ఉన్నా, లేదా చిన్న వయసులోనే ఆకస్మిక మరణం సంభవించినా, తీవ్రమైన గుండె లయ సమస్యలు ఉన్నా ప్రత్యేక అప్రమత్తత అవసరం. కొన్ని రకాల కార్డియోమయోపతిలు జన్యుపరంగా, వంశపారంపర్యంగా ఒకే కుటుంబంలోని పలువురికి వచ్చే అవకాశం ఉంటుంది.
చికిత్సా మార్గాలు ఇవే..
కార్డియోమయోపతికి అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. అసలు కారణాన్ని బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు.
- రక్తపోటును అదుపులో ఉంచడానికి, శరీరంలో అదనంగా నీరు చేరకుండా చూడటానికి, గుండె వేగాన్ని క్రమబద్ధీకరించడానికి మందులు వాడాల్సి వస్తుంది.
- థైరాయిడ్ లేదా ఐరన్ లోపం వంటి ఇతర కారణాలు ఉంటే వాటికి తగిన చికిత్స అందిస్తారు.
- గుండె లయ తప్పడం (అరిథ్మియా) అనే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి 'ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్' (ICD) అనే పరికరాన్ని అమర్చడాన్ని డాక్టర్ పరిశీలిస్తారు.
- గుండె వైఫల్యం తీవ్రంగా (Advanced Heart Failure) ఉన్నవారికి గుండె మార్పిడి (Heart Transplant) కూడా చివరి దశ చికిత్సగా అవసరం కావచ్చు.
మీ రిపోర్టులో "గుండె పరిమాణం పెరిగింది" అని ఉంటే, కేవలం స్కాన్ రిపోర్టు చూసి భయపడకుండా అసలు కారణం ఏమిటో వైద్యులను అడిగి తెలుసుకోండి. రోజువారీ జీవితంలో కనిపిచే కొత్త లక్షణాలను పర్యవేక్షిస్తూ, సరైన సమయంలో నిపుణుల సలహా పొందడమే సురక్షితమైన మార్గం.
వ్యాసకర్త:
— డాక్టర్ లక్ష్మి నవ్య,
కన్సల్టెంట్ – కార్డియాలజీ,
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ.