Happy New Year Wishes 2026: మీ స్నేహితులు, బంధువుల కోసం అందమైన న్యూ ఇయర్ విషెస్!

New Year 2026 Wishes and Quotes: మీరు కొత్త సంవత్సరం (New Year 2026) సంతోషంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అయితే మరి మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా సంతోషంగా ఉండాలని, కొత్త సంవత్సరం వారికి కూడా బాగా కలిసి రావాలని అనుకుంటున్నట్లయితే, ఈ విషెస్‌ని వారితో పంచుకోండి.

Published on: Dec 31, 2025 4:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

New Year 2026 Wishes and Quotes: మరి కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త సంవత్సరం సంతోషంగా సాగిపోవాలని అనుకుంటూ, అన్నీ జరగాలని భావిస్తారు. మీరు కూడా కొత్త సంవత్సరం (New Year 2026) సంతోషంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అయితే అందరూ కూడా “అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి” అని అనుకుంటారు.

న్యూఇయర్ విషెస్ & కోట్స్ 2026 (pinterest)
న్యూఇయర్ విషెస్ & కోట్స్ 2026 (pinterest)

మరి మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా సంతోషంగా ఉండాలని, కొత్త సంవత్సరం వారికి కూడా బాగా కలిసి రావాలని అనుకుంటున్నట్లయితే, ఈ విషెస్‌ని (Happy New Year Quotes and Wishes 2026) వారితో పంచుకోండి. దూరంగా ఉన్న వ్యక్తులకు సందేశాలను పంపిస్తూ ఉంటాం. అలాంటి వారికి కేవలం నార్మల్‌గా కాకుండా, ఈ స్పెషల్ కోట్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్తే మరింత బావుంటుంది కదా? మరి ఓసారి ఈ కోట్స్‌పై ఒక లుక్ వేసేయండి.

న్యూఇయర్ విషెస్ & కోట్స్, (pinterest)
న్యూఇయర్ విషెస్ & కోట్స్, (pinterest)

న్యూఇయర్ విషెస్ & కోట్స్, హ్యాపీ న్యూ ఇయర్ 2026 కోట్స్, కొత్త సంవత్సరం 2026 విషెస్:

ఎన్నో ఆశలను తీసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరువేస్తూ, కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ, ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం జీవితంలో వెలుగులు నింపాలి. సరికొత్త విజయాలను తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, హ్యాపీ న్యూ ఇయర్ 2026.

కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందం ఉండాలి.. ప్రతి విజయంలో గెలుపే ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్.

కష్టాలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా కలిసి నిలుద్దాం. కలిసి గెలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్.

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మర్చిపోకూడదు. కొత్త సంవత్సరం కాంతులను నింపాలని, రంగులమయం అవ్వాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ న్యూ ఇయర్ 2026.

మధురమైన ప్రతిక్షణం జీవితాంతం నిలుస్తుంది. కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలు అందించాలని కోరుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్.

చేసిన తప్పుల్ని మర్చిపోకూడదు. వాటిని సరిదిద్దుకోవాలి. కొత్త ఉత్సాహాన్ని నింపుకోవాలి. కొత్త ఆశలను మనసులో చిగురింప చేయాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్.

కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, సరికొత్త ఆనందాలు ఉండాలని, జీవితం సంతోషంగా ఉండాలని, నవ్వులతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

న్యూఇయర్ విషెస్ & కోట్స్ (pinterest)
న్యూఇయర్ విషెస్ & కోట్స్ (pinterest)

పాత సంవత్సరం చేదు-తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, మీ ఆశలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మై డియర్ నేస్తం, కొత్త ఏడాది నీవు మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2026.

సంబరాలు మిన్నంటే వేళ, జీవితాల వెలుగులు ఈవేళ మరింత ప్రకాశించాలని కోరుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పాత సంవత్సరంలోని తప్పులను వదిలి, కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

న్యూఇయర్ విషెస్ & కోట్స్ (pinterest)
న్యూఇయర్ విషెస్ & కోట్స్ (pinterest)

ఆయురారోగ్య, ఐశ్వర్య అభివృద్ధిరస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం. అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్.

మధురమైన ప్రతిక్షణం జీవితాంతం నిలుస్తుంది. అలాంటి క్షణాలు ఎన్నో ఈ కొత్త సంవత్సరం మీకు రావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More