ఒకసారి నల్లులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇక అంతే సంగతులు! చూస్తుంటేనే అవి ఘోరంగా పెరిగిపోతాయి. అవి మంచాలు, దిండ్లు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, చివరికి బట్టలలో కూడా గూడు కట్టుకుంటాయి. మీకు కనిపించవు, కానీ అవకాశం దొరికినప్పుడల్లా కుట్టి రక్తం పీలుస్తాయి.

నల్లులు అనేవి చిన్న ఎరుపు-గోధుమ రంగు కీటకాలు. ఇవి సాధారణంగా రాత్రిపూట మానవ రక్తాన్ని తాగుతాయి. అవి చాలా చిన్న సందులలో, పరుపుల అంచులలో, మంచం ఫ్రేములలో, హెడ్‌బోర్డులలో, చెక్క ఫర్నిచర్ కీళ్లలో కూడా దాక్కుంటాయి. వాటి శరీర ఆకృతి వల్ల సన్నని ప్రదేశాలలో కూడా దూరిపోగలవు. చాలా మంది నల్లులను వదిలించుకోవడానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ అవి ఎల్లప్పుడూ పనిచేయవు. అంతేకాకుండా రసాయన ఉత్పత్తులకు లెక్కలేనన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. సహజ పద్ధతిని నమ్మండి. ఈ సులభమైన పద్ధతిలో మీ ఇంటి నుండి నల్లులను శాశ్వతంగా తొలగించండి.
- వేప నల్లులను తరిమికొడుతుంది. నల్లులు వేప వాసనను తట్టుకోలేవు. మంచం పగుళ్లు, సందులలో వేప నూనెను పూర్తిగా రాయండి. లేదా మీరు ఎండిన వేప ఆకులను మంచం మీద పరచవచ్చు.
- మంచం మీద లేదా ఉయ్యాల మీద కర్పూరం పొడిని చల్లండి. నల్లులు కర్పూరం ఘాటైన వాసనను అస్సలు తట్టుకోలేవు.
- మంచం లేదా సోఫాను గోడకు వీలైనంత దూరంగా ఉంచండి. దీనివల్ల నల్లుల బెడద తగ్గుతుంది. నల్లులను తరిమికొట్టడానికి మీరు అప్పుడప్పుడు ఫర్నిచర్‌పై కిరోసిన్ చల్లవచ్చు.
- దిండ్లు, పరుపులు, మ్యాట్రెస్‌లలో నల్లులు గూళ్ళు కట్టి ఉంటే వాటిని ఎండలో పెట్టండి. సూర్యరశ్మికి నల్లులు చనిపోతాయి. అంతేకాకుండా సూర్యరశ్మి వేడికి నల్లుల గుడ్లు కూడా నశించిపోతాయి.
- నల్లులను వదిలించుకోవడంలో పసుపు, వేప ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేప ఆకులను, పసుపును కలిపి నూరి ముద్దలా చేయండి. ఈ మిశ్రమాన్ని మంచం మీద లేదా నల్లులు ఉన్న ఏ ప్రదేశంలోనైనా రాయండి. ఈ మిశ్రమం వాసన, పదార్థాలు నల్లులను దూరంగా ఉంచుతాయి.
అవి వేగంగా నల్లులు సంతానోత్పత్తి చేస్తాయి. అనేక సాధారణ పురుగుమందులకు నిరోధకతను పెంచుకున్నాయి. నల్లులు కుడితే చేతులు, కాళ్లు, మెడ, ముఖం వంటి బహిర్గతమైన చర్మ ప్రాంతాలపై ఎర్రటి, దురదతో కూడిన బొబ్బలు కనిపిస్తాయి. మీ ఇంట్లో నల్లులు ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ చిన్న కీటకాలు మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తాయి.
{{/usCountry}}అవి వేగంగా నల్లులు సంతానోత్పత్తి చేస్తాయి. అనేక సాధారణ పురుగుమందులకు నిరోధకతను పెంచుకున్నాయి. నల్లులు కుడితే చేతులు, కాళ్లు, మెడ, ముఖం వంటి బహిర్గతమైన చర్మ ప్రాంతాలపై ఎర్రటి, దురదతో కూడిన బొబ్బలు కనిపిస్తాయి. మీ ఇంట్లో నల్లులు ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ చిన్న కీటకాలు మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తాయి.
{{/usCountry}}