వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ గృహిణులకు మాత్రం బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. నిరంతరం కురిసే వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం, ఎండ లేకపోవడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. దీనివల్ల బట్టల నుండి ఒక రకమైన కుళ్లిన వాసన లేదా చెడు వాసన(Musty Smell) వాసన వస్తుంది. అంతేకాదు బట్టల్లో తేమ ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం కూడా ఉంది.

ఈ వర్షాకాలంలో మీ బట్టల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా, ఎల్లప్పుడూ సువాసనభరితంగా ఉండాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
ఎక్కువ డిటర్జెంట్ వాడకండి.. వెనిగర్ ఉపయోగించండి!
చాలా మంది ఎక్కువ సర్ఫ్ లేదా లిక్విడ్ వాడితే బట్టలు బాగా క్లీన్ అవుతాయని, వాసన రావని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల అది బట్టల పోగులలో పేరుకుపోయి, తేమను బంధించి ఉంచుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా చేరి వాసన మరింత పెరుగుతుంది.
బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ పరిమాణాన్ని తగ్గించండి. బట్టలు పిండే చివరి నిమిషంలో ఒక కప్పు తెల్ల వెనిగర్ లేదా కొద్దిగా డెటాల్ వేయండి. ఇది బట్టల్లోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను దూరం చేస్తుంది.
బట్టల్లోని నీటిని పూర్తిగా పిండేయండి
బట్టలు త్వరగా ఆరాలంటే వాటిలో అస్సలు నీరు ఉండకూడదు. ఒకవేళ మీరు వాషింగ్ మెషీన్ వాడుతుంటే, బట్టలు ఉతికిన తర్వాత మరోసారి ఎక్స్‌ట్రా స్పిన్ సైకిల్ రన్ చేయండి. చేత్తో ఉతికేవారైతే నీరు లేకుండా గట్టిగా పిండేయాలి. దీనివల్ల బట్టల్లోని 90 శాతం నీరు పోయి, అవి ఇంట్లోనే ఫ్యాన్ కిందనైనా త్వరగా ఆరిపోతాయి. వాసన కూడా రాదు. బట్టల్లో నీరు ఎక్కువగా ఉంటే.. అవి ఆరేందుకు టైమ్ పడుతుంది.
ఇంట్లో బట్టలు ఆరబెట్టేటప్పుడు జాగ్రత్తలు
వర్షం పడుతున్నప్పుడు బట్టలను ఇంట్లోనే ఆరబెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వంటగది, బాత్రూమ్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బట్టలు వేయకండి. కిటికీల పక్కన, గాలి బాగా ఆడే హాల్లో లేదా నేరుగా ఫ్యాన్ కింద బట్టలు ఆరబెట్టాలి. బట్టల మధ్య తగినంత గ్యాప్ ఉంచడం వల్ల గాలి తగిలి త్వరగా ఆరుతాయి. చాలా మంది ఒకదానిమీద మరోటి వేస్తారు. దీంతో బట్టలు కంపు వాసన వస్తాయి.
గదిలోని తేమను తగ్గించే చిట్కాలు
{{/usCountry}}వర్షం పడుతున్నప్పుడు బట్టలను ఇంట్లోనే ఆరబెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వంటగది, బాత్రూమ్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బట్టలు వేయకండి. కిటికీల పక్కన, గాలి బాగా ఆడే హాల్లో లేదా నేరుగా ఫ్యాన్ కింద బట్టలు ఆరబెట్టాలి. బట్టల మధ్య తగినంత గ్యాప్ ఉంచడం వల్ల గాలి తగిలి త్వరగా ఆరుతాయి. చాలా మంది ఒకదానిమీద మరోటి వేస్తారు. దీంతో బట్టలు కంపు వాసన వస్తాయి.
గదిలోని తేమను తగ్గించే చిట్కాలు
{{/usCountry}}గదిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే బట్టలు అస్సలు ఆరవు. మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉంటే దాన్ని డ్రై మోడ్‌లో ఉంచడం ద్వారా గదిలోని తేమను తగ్గించవచ్చు. ఒకవేళ ఏసీ లేకపోతే, బట్టలు ఆరబెట్టిన స్టాండ్ కింద ఒక గిన్నెలో రాతి ఉప్పు ఉంచండి. ఇది గాలిలోని తేమను పీల్చేసుకుంటుంది. అలాగే బట్టల అల్మారాల్లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచడం వల్ల బట్టలు ఎప్పుడూ డ్రైగా ఉంటాయి. వాసన రావు.
కొద్దిగా తేమ ఉన్నప్పుడే ఇస్త్రీ చేయండి
బట్టలు 90 శాతం ఆరిన తర్వాత కూడా కొద్దిగా చల్లగా, తేమగా అనిపిస్తే వెంటనే వాటిని ఐరన్ చేయండి. ఇస్త్రీ పెట్టె వేడికి బట్టల్లోని మిగిలిన తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. అంతేకాకుండా, తేమ వల్ల బట్టలపై చేరిన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. వాసన కూడా రావు.
మరికొన్ని చిట్కాలు
కొన్నిసార్లు బట్టల వల్ల కాకుండా మురికిగా ఉన్న వాషింగ్ మెషీన్ డ్రమ్ వల్ల కూడా బట్టలు వాసన వస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి మెషీన్‌ను టబ్ క్లీన్ చేయండి. వాడిన తర్వాత మెషీన్ మూతను కాసేపు తెరిచి ఉంచండి.
వర్షాకాలంలో జీన్స్, లావుపాటి కాటన్ దుస్తులు ఆరడం చాలా కష్టం. కాబట్టి ఈ సీజన్ లో త్వరగా ఆరిపోయే నైలాన్, జార్జెట్, సిల్క్ లేదా లైట్ వెయిట్ దుస్తులను ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
దుర్వాసన ఎక్కువగా ఉన్న బట్టలను ఉతికేటప్పుడు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే ఎలాంటి మొండి వాసనలైనా మాయమవుతాయి.