...
...
Next Story

Homemade Curd Tips : పెరుగు తోడు పెడితే ఎక్కువగా నీరు పేరుకుపోతుందా..? గడ్డ పెరుగు కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

Homemade Curd Tips: వేసవిలో చల్లటి గడ్డ పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే ఇంట్లో తోడు పెట్టినప్పుడు పైన నీరు రాకుండా…. చిక్కని పెరుగు రావాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.

Published on: Apr 29, 2026, 09:57:44 IST
Advertisement

Homemade Curd Tips : భారతీయ భోజనంలో పెరుగు లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లటి పెరుగు ఇచ్చే హాయి వేరు. మార్కెట్లో రకరకాల డెయిరీ బ్రాండ్ల పెరుగు దొరుకుతున్నా, ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు రుచి, ఆరోగ్యం మాటాల్లో వర్ణించలేం.

గడ్డ పెరుగు కోసం  సింపుల్ చిట్కాలు
గడ్డ పెరుగు కోసం సింపుల్ చిట్కాలు

చాలా మంది మహిళలు రాత్రి పాలను తోడు పెడితే ఉదయానికి పెరుగు సిద్ధమవుతుంది. అయితే….పెరుగు గడ్డకట్టిన తర్వాత పైన నీరు పేరుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇలా కాకుండా ఐస్‌క్రీంలాంటి గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….

గడ్డ పెరుగు తయారీ ఇలా…

మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నుండి వస్తున్న అత్యంత సులభమైన పద్ధతి పాలను సరిగ్గా మరిగించడం. పాలు ఎంత చిక్కగా ఉంటే పెరుగు అంత అద్భుతంగా వస్తుంది.

  • ముందుగా పాలను బాగా మరిగించి…. కొద్దిసేపు పక్కన పెట్టాలి.
  • పాలు మరీ వేడిగా కాకుండా, కేవలం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడు వేయాలి.
  • ఒక మట్టి కుండ తీసుకుని, పాలను నాలుగు ఐదు సార్లు బాగా తిరబోయాలి. ఇలా చేయడం వల్ల పాలలో గాలి బుడగలు వచ్చి పెరుగు సాఫ్ట్‌గా వస్తుంది.
  • ఇప్పుడు ఒక చెంచా పెరుగు (జామున్) తీసుకుని పక్క నుంచి మెల్లగా పాలల్లో కలపాలి.
  • కుండను అస్సలు కదపకుండా 5 నుండి 6 గంటల పాటు మూత పెట్టి ఉంచాలి.

పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు కనిపిస్తుంటే…. ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది. రెండు లేదా మూడు టిష్యూ పేపర్లను తీసుకుని, గడ్డకట్టిన పెరుగు పైన పరిచినట్లు పెట్టండి. పెరుగులో ఉండే అదనపు తేమను ఈ టిష్యూ పేపర్ పూర్తిగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత కుండను ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తినే ముందు టిష్యూ పేపర్ తీసేస్తే, నీరు లేని చిక్కని గడ్డ పెరుగు మీ సొంతమవుతుంది.

త్వరగా తోడుకోవాలంటే ఇలా….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON