పెరుగు తింటే నిజంగా జలుబు చేస్తుందా? రాత్రిపూట తినవచ్చా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెబుతున్న సలహాలివే

తెలుగు రాష్ట్రాల్లో పెరుగన్నం అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక ఎమోషన్. అయితే, పెరుగు విషయంలో మనలో చాలామందికి రకరకాల సందేహాలు, అపోహలు ఉన్నాయి. వీటిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Feb 28, 2026, 06:37:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెరుగు గురించి సాధారణంగా అడిగే 13 ప్రశ్నలకు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం శాస్త్రీయంగా సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు తింటే నిజంగా జలుబు చేస్తుందా? రాత్రిపూట తినవచ్చా? డాక్టర్ సలహా ఇదీ (Unsplash )
పెరుగు తింటే నిజంగా జలుబు చేస్తుందా? రాత్రిపూట తినవచ్చా? డాక్టర్ సలహా ఇదీ (Unsplash )

1. అసలు పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా?

కచ్చితంగా.. పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, మన పొట్టకు మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం జీర్ణక్రియకే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం.

2. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందా?

చాలామందిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులోని 'లైవ్ కల్చర్స్' (మంచి బ్యాక్టీరియా) మన పేగుల్లోని బ్యాక్టీరియాను సమతుల్యం చేసి, జీర్ణ ప్రక్రియను సాఫీగా మారుస్తాయి.

3. పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా?

చాలామంది నమ్మే అతిపెద్ద అపోహ ఇది. సాధారణంగా పెరుగు వల్ల జలుబు చేయదు. అయితే, మీకు చల్లటి పదార్థాలు పడకపోతే (Sensitive to cold foods) మాత్రం ఇబ్బంది కలగవచ్చు. అప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగును తీసుకోవడం ఉత్తమం.

4. రాత్రిపూట పెరుగు తినవచ్చా?

మీ శరీరతత్వానికి పడుతుంటే రాత్రిపూట పెరుగు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రాత్రి భోజనాన్ని 7 గంటల లోపే ముగించాలని డాక్టర్ మాణిక్యం సూచిస్తున్నారు.

5. పాలు మంచివా? పెరుగు మంచిదా?

జీర్ణక్రియ పరంగా చూస్తే పాల కంటే పెరుగే మేలు. పాలు త్వరగా అరగని వారు కూడా పెరుగును సులువుగా జీర్ణించుకోగలరు.

6. పెరుగు తింటే ఎసిడిటీ వస్తుందా?

నిజానికి పెరుగు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, మరీ పులిసిపోయిన పెరుగు తింటే మాత్రం ఎసిడిటీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

7. ఇంట్లో తోడుపెట్టిన పెరుగా? ప్యాకెట్ పెరుగా? ఏది బెస్ట్?

ఇంట్లో తోడుపెట్టిన పెరుగే అన్ని విధాలా శ్రేయస్కరం. ఇది తాజాగా ఉండటమే కాకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ (Additives) లేకుండా ఉంటుంది.

8. రోజుకు ఎంత పెరుగు తినాలి?

ఒక సామాన్య వ్యక్తి రోజుకు ఒక కప్పు పెరుగు తీసుకోవడం ఆరోగ్యకరం.

9. షుగర్ (డయాబెటిస్) ఉన్నవారు పెరుగు తినవచ్చా?

తప్పకుండా తినవచ్చు. అయితే తీపి కలపని, సహజసిద్ధమైన పెరుగును మాత్రమే తీసుకోవాలి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ రోగులకు ఇది సురక్షితం.

10. పెరుగు తింటే కడుపు ఉబ్బరం (Bloating) వస్తుందా?

సాధారణంగా పెరుగు వల్ల కడుపు ఉబ్బరం రాదు. ఒకవేళ మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ (పాలు పడని సమస్య) ఉంటే తప్ప, పెరుగు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

11. ప్రతిరోజూ పెరుగు తినవచ్చా?

పాల ఉత్పత్తులు పడేవారు నిరభ్యంతరంగా ప్రతిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

12. పెరుగు తినడానికి సరైన సమయం ఏది?

మధ్యాహ్న భోజన సమయంలో పెరుగు తీసుకోవడం అత్యుత్తమం అని డాక్టర్ మాణిక్యం పేర్కొన్నారు. ఇది ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది.

13. చేపలతో కలిపి పెరుగు తినవచ్చా?

చాలామంది చేపలు, పెరుగు కలిపి తింటే చర్మ వ్యాధులు వస్తాయని భయపడతారు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. చేపలు, చికెన్ లేదా మటన్ వంటి ఏ ప్రోటీన్ ఆహారంతోనైనా పెరుగును కలిపి తీసుకోవచ్చు.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకున్నా మీ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More