భార్య, అత్తమామల మధ్య సంబంధాన్ని బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో తల్లిదండ్రులు, వివాహం, కుటుంబ బాధ్యతల పట్ల ఉండే అంచనాలు తరచూ ఘర్షణలకు దారితీస్తుంటాయి. భార్యాభర్తల మధ్య, అత్తమామల మధ్య అభిప్రాయభేదాలు రావడం సాధారణమే. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భర్త స్పందించే తీరే ఆ బంధం నిలబడటంలో కీలక పాత్ర పోషిస్తుందని రిలేషన్‌షిప్ కోచ్ చేత్నా చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలే షేర్ చేసిన ఒక పోస్ట్‌లో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. 15 ఏళ్ల అనుభవమున్న రిలేషన్‌షిప్ కోచ్ అయిన చేత్నా.. బలమైన విలువలు కలిగిన ఏ మగాడూ తన భార్యతో అసలు చెప్పకూడని ఆ ఒక్క పొరపాటు మాట ఏమిటో వివరించారు.
భర్త అసలు చెప్పకూడని ఆ మాట ఇదే!
"మంచి నడవడిక, బలమైన విలువలున్న భారతీయ పురుషులు తమ భార్యతో ఎప్పటికీ ఈ ఒక్క మాట అనరు" అని చేత్నా పేర్కొన్నారు. తన తల్లిదండ్రులే తనకు మొదటి ప్రాధాన్యత అని, భార్యకు వేరే ప్రత్యామ్నాయం లేదని, ఎప్పుడూ సర్దుకుపోవాలని ఒక పరిణతి చెందిన భర్త ఎప్పటికీ అనకూడదని ఆమె స్పష్టం చేశారు.
"పదిహేనేళ్ల అనుభవమున్న రిలేషన్‌షిప్ కోచ్‌గా చెబుతున్నాను. వెన్నెముక ఉన్న ఏ భారతీయ భర్త కూడా తన భార్యతో ఈ మాట అనడు," అని ఆమె కుండబద్దలు కొట్టారు.
భర్తలు వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి?
భార్యకు, అత్తమామలకు మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు.. ఒక పరిణతి చెందిన భర్త కేవలం భార్యనే సర్దుకుపోవాలని బలవంతం చేయకూడదని చేత్నా తెలిపారు. తల్లిదండ్రులతో కఠినమైన సంభాషణలకు భయపడి భార్యపై నెపం నెట్టడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు.
"భార్య, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేనప్పుడు.. మంచి విలువలున్న ఒక పరిణతి చెందిన భారతీయ పురుషుడు తన తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడతాడు," అని చేత్నా వివరించారు.
{{/usCountry}}"భార్య, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేనప్పుడు.. మంచి విలువలున్న ఒక పరిణతి చెందిన భారతీయ పురుషుడు తన తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడతాడు," అని చేత్నా వివరించారు.
{{/usCountry}}ఎవరి వైపు తప్పు ఉందో గుడ్డిగా ఒకరిని వెనుకేసుకురాకుండా, భార్యతోనూ అలాగే తల్లిదండ్రులతోనూ నిష్పక్షపాతంగా, నిజాయితీగా చర్చలు జరపాలని ఆమె సూచించారు. "అతను తన భార్యతోనూ, తల్లిదండ్రులతోనూ సరైన చర్చలు జరుపుతాడు. కానీ ఏ దశలోనూ భార్యను తక్కువ చేసి మాట్లాడడు. కేవలం ఆమెనే అన్నీ త్యాగం చేయాలని ఒత్తిడి చేయడు," అని చేత్నా పేర్కొన్నారు.
తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం అని, వారి ఇష్టమే వేదమని భావించి వివాహ బంధాన్ని చిన్నచూపించడం సరికాదని ఆమె విమర్శించారు. తల్లిదండ్రులపై గౌరవం ఉండటం అంటే భార్య భావోద్వేగాలను పట్టించుకోకుండా ఉండటం కాదని, ప్రశాంతత కోసం ఆమెనే నిత్యం రాజీపడాలని కోరడం తప్పు అని ఆమె స్పష్టం చేశారు. "మంచి సంస్కారం, సరైన విలువలు కలిగిన ఏ భర్త కూడా ఇలా ప్రవర్తించడు," అని చేత్నా ముగించారు.