భారతదేశంలో ఏటా నమోదవుతున్న వ్యాధుల నివేదికలను పరిశీలిస్తే, మలేరియా కేసులు కాలక్రమేణా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజారోగ్యం పరంగా ఇది ఇప్పటికీ తీవ్ర ముప్పుగానే మిగిలింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో మలేరియా తీవ్రత అధికంగా ఉంటోంది. పారిశుధ్య లోపం, నిల్వ ఉండే నీరు దోమల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుండగా; నిర్మాణం, గనుల తవ్వకం, వ్యవసాయ పనుల కోసం రాష్ట్రాలు దాటే వలస కూలీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో, సులభంగా నివారించదగిన, త్వరితగతిన నయం చేయదగిన మలేరియాపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజీషియన్, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ హరి కిషన్ బూరుగు స్పష్టం చేశారు. మలేరియా ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయన 'ABCD' అనే అత్యంత ప్రభావవంతమైన ఫార్ములాను ప్రతిపాదించారు.
మలేరియా నివారణకు ABCD సూత్రం
A – Awareness (మలేరియా ముప్పుపై అవగాహన)
మలేరియా నివారణ అనేది మొదట అవగాహనతోనే ప్రారంభమవుతుంది. వర్షాకాలంలోనూ, వర్షాలు తగ్గిన వెంటనే దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించేవారు, వలస కూలీలు స్థానికంగా ఉండే మలేరియా పరిస్థితులపై ముందే తెలుసుకోవడం అవసరం. ఒకసారి మలేరియా వచ్చి తగ్గినంత మాత్రాన శరీరానికి పూర్తి నిరోధకత రాదని, మళ్లీ సోకే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
B – Bite Prevention (దోమ కాటు నుంచి రక్షణ)
మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ (Anopheles) దోమ కాటు ద్వారానే సంక్రమిస్తుంది. కాబట్టి దోమ కాటు పడకుండా చూసుకోవడమే ప్రధాన నివారణ చర్య.
- క్రిమిసంహారకాలతో శుద్ధి చేసిన దోమతెరల (ITNs) కింద నిద్రపోవాలి.
- సాధ్యమైనంతవరకు కిటికీలకు మెష్ ఉన్న గదుల్లో లేదా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నివాసం ఉండాలి.
- శరీరం పూర్తిగా కప్పబడేలా పొడవాటి చేతుల దుస్తులు, ప్యాంట్లు ధరించాలి.
- చర్మానికి DEET కలిగిన రక్షక లోషన్లు లేదా క్రీములను ఉపయోగించాలి.
- దోమల సంచారం ఎక్కువగా ఉండే సాయంత్రం, ఉదయం వేళల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
- వెల్లుల్లి, విటమిన్లు, మూలికా ఉత్పత్తులు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు మలేరియాను నివారిస్తాయనే ప్రచారాలకు శాస్త్రీయ ప్రామాణికత లేదు. శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతులనే అనుసరించడం శ్రేయస్కరం.
C – Chemoprophylaxis (ముందస్తు ఔషధ ప్రయోగం)
మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకోవడాన్ని కెమోప్రోఫిలాక్సిస్ అంటారు. వెళ్లే ప్రాంతం, అక్కడ ఉండే మలేరియా డ్రగ్ రెసిస్టెన్స్ (మందులకు లోబడని తీవ్రత), ప్రయాణ సమయం ఆధారంగా వైద్యులు తగిన మందులను సూచిస్తారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే ఈ మందులు వాడాలి. అయితే ముందస్తు మందులు వాడినప్పటికీ దోమ కాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆపకూడదు.
D – Diagnose Without Delay (ఆలస్యం చేయకుండా నిర్ధారణ)
{{/usCountry}}మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకోవడాన్ని కెమోప్రోఫిలాక్సిస్ అంటారు. వెళ్లే ప్రాంతం, అక్కడ ఉండే మలేరియా డ్రగ్ రెసిస్టెన్స్ (మందులకు లోబడని తీవ్రత), ప్రయాణ సమయం ఆధారంగా వైద్యులు తగిన మందులను సూచిస్తారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే ఈ మందులు వాడాలి. అయితే ముందస్తు మందులు వాడినప్పటికీ దోమ కాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆపకూడదు.
D – Diagnose Without Delay (ఆలస్యం చేయకుండా నిర్ధారణ)
{{/usCountry}}వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స పొందితే తీవ్రమైన అనర్థాలను అరికట్టవచ్చు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన తర్వాత చలి, జ్వరం, చెమటలు పట్టడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయాణంలో ఉన్నా లేదా తిరిగి వచ్చిన తర్వాత అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించి బ్లడ్ స్మియర్ (Blood Smear) లేదా ఆర్టీపీసీఆర్/ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ (RDT) ద్వారా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. స్వీయ వైద్యం (Self-medication) కాకుండా అర్హులైన వైద్యుల మార్గదర్శకత్వంలోనే మందులు వాడాలి.
పరిష్కార మార్గం
మలేరియా రహిత భారత్ నిర్మాణం కోసం ప్రజలు నిలకడైన ముందస్తు జాగ్రత్తలు పాటించడం, సకాలంలో వైద్య సేవలు పొందడం చాలా ముఖ్యం.
వ్యాసకర్త:
డాక్టర్ హరి కిషన్ బూరుగు,
కన్సల్టెంట్ ఫిజీషియన్ & అంటువ్యాధుల నిపుణులు,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.