Niruba Ice Creamwala : కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు, కెమికల్ ప్రిజర్వేటివ్‌లతో నిండిన ప్యాకేజ్డ్ ఐస్‌క్రీమ్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. కేవలం నాలుగు సహజమైన వస్తువులతోనే అద్భుతమైన ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు గుజరాత్‌కు చెందిన నిరంజన దేశాయ్. ఈమె వయస్సు 80ఏళ్లు కావడం విశేషం. ‘నిరూబెన్’ అని అందరూ పిలిచే ఈ బామ్మ గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి యంత్రాలు లేకుండా సంప్రదాయ పద్ధతిలోనే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తూ అహ్మదాబాద్‌లో వ్యాపారాన్ని చేస్తున్నారు. ఆమె ఒక బ్రాండ్‌గా మారారు.

పెద్ద పెద్ద బ్రాండ్లు మార్కెట్లో పోటీ పడుతున్నా, ఈ 80 ఏళ్ల బామ్మ హోమ్‌మేడ్ ఐస్‌క్రీమ్‌ల రుచి ముందు అవన్నీ వేస్ట్ అనాల్సిందే! పాలు, మీగడ, స్టీవియా (సహజమైన తీపి కోసం వాడే ఆకు), తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్.. ఈ నాలుగు నాచురల్ ఇంగ్రిడియంట్స్ని మాత్రమే ఉపయోగించి నిరూబెన్ ప్రతిరోజూ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తారు.
ఈ ‘నిరూబా ఐస్‌క్రీమ్‌వాలా’ విజయ ప్రస్థానం, ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి..
1986లో కిచెన్ స్టవ్‌తో మొదలైన ప్రయాణం!
ది బెటర్ ఇండియా నివేదిక ప్రకారం.. నిరూబెన్ మొదట్లో తన ఇంట్లోని చిన్న గ్యాస్ స్టవ్‌పై.. పొరుగువారు, బంధువులు, ఇంటికి వచ్చే అతిథుల కోసం ఐస్‌క్రీమ్‌లు చేసేవారు. అయితే ఆ రుచి చూసినవారంతా ఫిదా అయిపోయి.. “బామ్మా, నువ్వు ఒక షాప్ పెట్టకూడదా?” అని సలహా ఇచ్చారు. అలా 1986లో ‘నిరూబా ఐస్‌క్రీమ్‌వాలా’ బ్రాండ్ పుట్టుకొచ్చింది. అప్పట్లో రోజ్ కోకోనట్, వరియాలీ (సోంపు), చాక్లెట్, బాదాం పిస్తా కేసర్, కేసర్ ఇలాచీ అనే కేవలం 5 ఫ్లేవర్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు 27 ఫ్లేవర్లకు చేరుకుంది.
భట్టీ, కడాయి.. అంతా దేశీ స్టైల్!
గత 30 ఏళ్లుగా ఈ దేశాయ్ కుటుంబంతో కలిసి పనిచేస్తున్న అమృత్ భాయ్ మాట్లాడుతూ, తమ తయారీ విధానాన్ని పంచుకున్నారు. నేటి ఆధునిక ఫ్యాక్టరీల్లో లాగా భారీ మెషీన్లు కాకుండా.. నిరూబెన్ వంటగదిలో ఇప్పటికీ ఒక పెద్ద ‘భట్టీ’ (పాతకాలపు పొయ్యి), భారీ కడాయి ఉంటాయి.
{{/usCountry}}గత 30 ఏళ్లుగా ఈ దేశాయ్ కుటుంబంతో కలిసి పనిచేస్తున్న అమృత్ భాయ్ మాట్లాడుతూ, తమ తయారీ విధానాన్ని పంచుకున్నారు. నేటి ఆధునిక ఫ్యాక్టరీల్లో లాగా భారీ మెషీన్లు కాకుండా.. నిరూబెన్ వంటగదిలో ఇప్పటికీ ఒక పెద్ద ‘భట్టీ’ (పాతకాలపు పొయ్యి), భారీ కడాయి ఉంటాయి.
{{/usCountry}}స్థానిక డెయిరీ నుంచి తెచ్చిన స్వచ్ఛమైన పాలు, మీగడను ఈ కడాయిలో పోసి గంటల తరబడి నెమ్మదిగా మరిగిస్తారు.
పాలు బాగా చిక్కబడిన తర్వాత, సాంప్రదాయ చెక్క కంటైనర్లలో వేసి ఐస్‌క్రీమ్ సిద్ధం చేస్తారు. 1986 నాటి అదే రెసిపీ, అదే రుచిని నేటికీ కాపాడుకుంటూ రావడం విశేషం.
షెల్ఫ్ లైఫ్ కేవలం 7 రోజులే!
కెమికల్స్ లేదా ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు అస్సలు వాడకపోవడం వల్ల ఈ ఐస్‌క్రీమ్‌ల లైఫ్ టైమ్ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వీరు షాప్‌తో పాటు క్యాటరింగ్ సర్వీసెస్, ప్యాకేజ్డ్ ఐస్‌క్రీమ్స్‌ను కూడా అందిస్తున్నారు. మామిడి, సపోటా, సీతాఫల్, కేసర్ పిస్తా వంటి ఫ్లేవర్లకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది.
80 ఏళ్ల వయసులోనూ నిరూబెన్ ప్రతిరోజూ ఉదయాన్నే కిచెన్‌లోకి అడుగుపెట్టి స్క్రాచ్ (మొదటి) నుంచి తాజా బ్యాచ్‌లను స్వయంగా తయారు చేస్తారు. నేటితరం పారిశ్రామికవేత్తలకు, జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నామనుకునే వారికి, ఏదైనా చేసేందుకు వయస్సు అయిపోయిందనుకునే వారికి.. ఈ బామ్మ నిబద్ధత, క్వాలిటీ మెయింటెనెన్స్ ఒక గొప్ప నిదర్శనం.