మామిడి, ఆపిల్, అరటి.. మీకు ఏ పండు ఇష్టమో చెబితే మీ క్యారెక్టర్ చెప్పేయొచ్చు!
ఒక వ్యక్తి ఇష్టాల ఆధారంగా కూడా వారి లక్షణాలను అంచనా వేయవచ్చని చెబుతారు. మీకు ఇష్టమైన పండు ఏంటో దాని ఆధారంగా మీరు ఎలాంటి వారో కూడా తెలుసుకోవచ్చు.
మీకు ఇష్టమైన పండును బట్టి మీ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. కొంతమందికి విదేశీ పండ్లు ఇష్టమైతే, మరికొందరికి స్థానిక పండ్లు ఇష్టం. దీనికి కారణం వారి గుణగణాలు, ఆలోచనా విధానాలు అని చెబుతుంటారు. మీ గుణగణాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? ఏ పండు ఎక్కువ ఇష్టం ఉంటే.. ఎలాంటి గుణాలు ఉంటాయో చూద్దాం..

అరటిపండు
మీకు అరటిపండ్లు అంటే చాలా ఇష్టమైతే.. మీరు దయగల, కరుణామయమైన వ్యక్తి. అలాగే స్నేహపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా ఉంటారు. మీలోని ఈ గుణం కారణంగా ఇతరులు మిమ్మల్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు. మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పటికీ.. మీరు అంత సులభంగా ఇతరుల మాటలకు ప్రభావితం కారు. చాలా నమ్మకమైన స్నేహితుడు, సహచరుడుగా ఉంటారు.
ఆపిల్
ప్రపంచంలో అత్యంత ఇష్టపడే పండ్లలో ఒకటి. ఆపిల్ తింటే డాక్టరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మీకు ఇష్టమైనదైతే.. మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. మీరు క్రీడాస్ఫూర్తి గలవారు, మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకుంటారు. మీరు జీవితంలో క్రమశిక్షణతో ఉంటారు. మీ మనస్సు, శరీరం పట్ల గొప్ప శ్రద్ధ తీసుకుంటారు. ముక్కుసూటిగా ఉంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీరు జీవితాన్ని ఆస్వాదిస్తారు.
మామిడి పండ్లు
పండ్లలలో రారాజు మామిడి. మామిడి పండు మీకు ఇష్టమైన పండు అయితే.. మీరు స్వభావరీత్యా మొండివారు కావచ్చు. ప్రతి విషయంలోనూ మీకు బలమైన అభిప్రాయాలు ఉంటాయి. మీరు చాలా తార్కికంగా ఆలోచిస్తారు. భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. హేతుబద్ధమైన ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులు మిమ్మల్ని నిరాశావాదిగా భావించవచ్చు. కానీ వాస్తవానికి మీరు చాలా శ్రద్ధ వహించేవారు.
నారింజ
నారింజ నారింజ పండ్లు మీకు ఇష్టమైన పండ్లైతే, మీరు ఓర్పు, పట్టుదల కలిగి ఉంటారు. చేసే పనులలో గంభీరంగా ఉంటారు. మీరు అనవసరమైన వాగ్దానాలు చేయరు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. మీరు చాలా ఆశావాదులుగా, ఆలోచనాపరులుగా ఉంటారు.
బేరి పండు
మీరు గనుక పియర్ పండును ఇష్టపడేవారైతే.. ఒకే చోట స్థిరంగా ఉండలేరు. ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చంచలంగా తేలికగా చిరాకుపడతారు. చాలా పనులు చేసి వాటిని వాయిదా వేస్తుంటారు. కానీ వాటిని పూర్తి చేయడానికి మీరు అరుదుగా ప్రయత్నిస్తారు. సాధారణంగా మీకు చాలా శక్తి ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు మీరు అకస్మాత్తుగా తగ్గిపోయి సోమరిగా మారిపోతారు.
నిమ్మకాయ
నిమ్మకాయ మీకు ఇష్టమైన పండు అయితే.. మీరు ప్రతి పనిని అందంగా, సరిగ్గా చేస్తారు. చాలా శుభ్రంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తారు. ప్రతి పనిని ఒక క్రమపద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు, చాలా సృజనాత్మకంగా ఉంటారు.
పుచ్చకాయ
పుచ్చకాయ మీకు ఇష్టమైన పండు అయితే.. మీరు కష్టపడి పనిచేసేవారు, చాలా తెలివైనవారు. మీరు చాలా సృజనాత్మకంగా, తెలివిగా ఉంటారు. మీరు సమర్థవంతంగా ఆలోచిస్తారు, ఏ సమస్యకైనా సులభంగా పరిష్కారాలను కనుగొంటారు.
చెర్రీ
మీకు అందమైన చెర్రీ పండ్లు ఇష్టమైతే.. మీరు చాలా ఊహాశక్తి గలవారు. మీకు సిగ్గు ఎక్కువ. మీ భావాలను ఎక్కువగా వ్యక్తపరచరు. మీకు సన్నిహితంగా ఉన్నవారితో మాత్రమే మాట్లాడతారు. చాలా నమ్మకస్తులు. స్వభావరీత్యా తేలికగా తీసుకునేవారు, విషయాలు మీకు అనుకూలంగా జరగకపోయినా ఎక్కువగా చింతించరు.
గమనిక : పైన అందించిన కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


